రంగారెడ్డి

ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, నవంబర్ 22: గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే మండల అధికారులు వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు చేపట్టాలని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వారంవారం నివేదించాలనే సంకల్పంతో (ఎంటిఎం) ప్రతి మంగళవారం నిర్వహించే ప్రత్యేక సమావేశం మొదటిసారిగా గండిపేట మండల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ విచ్చేశారు. ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యలను ఆయా శాఖల అధికారులను ముందుగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధగ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గ్రామాల్లో ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాలని తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యతగా చేపట్టాలని హెచ్చరించారు. కొత్తగా, చిన్నగా గండిపేట మండలం ఏర్పాటు జరిగిందన్నారు. అభివృద్ధిలో ఎక్కడా లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులను హెచ్చరించారు. ప్రజలతో కలసిమెలసి పనులను చేయాలని పేర్కొన్నారు. ప్రజలు అధికారుల వద్దకు వచ్చినప్పుడు వారి విన్నపాలను తీసుకుని, పలుమార్లు తిప్పకుండా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్ని శాఖల వద్ద పెండింగ్‌లో ఏ పనులు ఉన్నాయో, వెంటనే ఆ పనులు చేపట్టి ఎప్పటికి పనులు పూర్తి అవుతాయో తెలియజేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాలోని గండిపేట మండలానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ మండలంలోని ప్రభుత్వం భూములు కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మండలంలోని మణికొండ గ్రామంలో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా జరిగాయని, ఈ ఆక్రమ నిర్మాణాలను గుర్తించి ఇప్పటికే మొదట నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా మరోసారి నోటీసులను వెంటనే అక్రమ నిర్మాణదారులకు అందజేయాలని గ్రామ కార్యదర్శులకు, విఆర్‌వోలకు తెలిపారు. గ్రామాలలో అక్రమ నిర్మాణాలు జరిగితే దానికి పూర్తి బాధ్యత గ్రామకార్యదర్శులదేనని తెలిపారు. ఇప్పటినుంచి అక్రమ నిర్మాణాలు జరిగితే ఊరుకునేది లేదని సంబంధిత అధికారులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని మరోసారి హెచ్చరించారు. ఆదేవిధంగా గ్రామాల్లో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పెండింగ్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రుణమాఫీ మూడో విడత రెండో ఫేజ్ కింద మండలంలో నిధులు విడుదల అయ్యాయన్నారు. దీంతో వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు.
పహాణీలను వెంటనే ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేయాలన్నారు. గత వర్షాలకు పంటనష్టం ఎంత మేరకు జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇక ఎంపి నిధుల పనులను వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా మండలంలోని పలు గ్రామాల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని ఆ సమస్యను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. మండలంలోని చెత్త డంపింగ్ యార్డ్, గ్రామాల్లో శ్మశానవాటికలను కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చిన్నగా అయిందని, అన్ని ప్రాంతాలను సందర్శించి, పనులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి తలారి మల్లేష్, ఆర్‌డివో శ్రీనివాస్, ఎంపిడివో సువిధ, మండల తహశీల్దార్ సుచరితతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.