రంగారెడ్డి

తెదేపాకు లభిస్తున్న ఆదరణతో టిఆర్‌ఎస్‌లో వణుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 1: తెలంగాణలో తెదేపాకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుండడంతో టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతుందని రాష్ట్ర తెదేపా బిసి సెల్ కార్యదర్శి మ్యాడం రామేశ్వర్‌రావు అన్నారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఫ్రెండ్స్‌కాలనీ, హైదర్‌గూడ, అత్తాపూర్ తదితర బస్తీలలో ఇంటింటికి తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంటున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి నెరవేర్చలేదని ఘాటుగా విమర్శించారు. సాధ్యం కాని హామీలను గుప్పించి ఎన్నికల్లో నాడు గెలిచి నేడు ప్రజలను విస్మరించారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ నిరంకుశ పాలనను ప్రజలు గ్రహిస్తున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారానే తగిన బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందే తప్ప ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. రోజురోజుకు ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుందని, టిఆర్‌ఎస్ తట్టుకోలేక తెదేపాపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్‌ఎస్‌కి డిపాజిట్లు దక్కవని హెచ్చరించారు. పి.నరేష్ ముదిరాజ్, కన్వీనర్ మురళీధర్‌రావు, ఎ.కృష్ణారెడ్డి, అనిల్, ఎం.విజయ్, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదులో
రేవంత్‌రెడ్డితో కలిసి..
కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో రాజేంద్రనగర్ తెదేపా రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి మ్యాడం రామేశ్వర్‌రావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలివెళ్లారు.
కొడంగల్‌లో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెదేపాకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్న వారిలో భూపాల్‌రెడ్డి, కె.మోహన్‌రెడ్డి, ఎ.కృష్ణారెడ్డి, సిహెచ్ కృష్ణగౌడ్, నాగరాజ్ పాల్గొన్నారు.