రంగారెడ్డి

రూ.174 కోట్లతో ఐటి కారిడార్ రోడ్ల అభివృద్ధి: కేటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 1: ఐటి కారిడార్‌లో 174 కోట్ల రూపాయలతో రోడ్లు అభివృద్ది చేస్తున్నామని, ఐదారు నెలల తరువాత ఐటి కారిడార్ అతి సుందరంగా తయారవుతుందని ఐటి శాఖ మంత్రి కేటి రామరావు తెలిపారు. దేశంలో అతి పెద్ద సైక్లింగ్ కంపెనీ సైకుల్ సంస్థతో డాక్టర్ రెడ్డీస్ కంపెనీ సైకిల్ షేరింగ్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. కార్యక్రమం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ ఐటి కంపెనీలో జరిగింది. అనంతరం రెడ్డీస్ రెడీబైక్‌ను ఐటిశాఖ మంత్రి రామరావుప్రారంభించారు. ఐదారు నెలల్లో ఐటి కారిడార్ రోడ్లు సుందరంగా తిర్చిదిద్ధేందుకు రూ.174 కోట్లు కేటాయించామని, త్వరలో టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని అన్ని వర్గాలుసంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి అనువుగా వౌలిక సదుపాయల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. న్యూఢిల్లీ తరహ ఇబ్బందులు ఇక్కడ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెరిగిపోతున్న కాలుష్యంపై అధ్యనం చేయాడాకి జపాన్‌లోని టోక్యో నగరాన్ని సందర్శించిన నిపుణుల బృందం తీసుకోవల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనుందని వివరించారు. పర్యావరణన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రజలు రిక్రియోషన్, రెసింగ్‌ల కోసం సైకిల్‌ని వినియోగిస్తున్నారని, సైకిలింగ్‌పై మరింత చైతన్యం తీసుకురావలసిన అవసరం ఎంతైన ఉందని అభిప్రాయపడ్డారు. సైకిలింగ్, హైబ్రిడ్, ఎలక్ట్రానిక్ సైకిలింగ్‌ను మెట్రోకు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. నగరంతో పాటు ఇతర రహదారులు పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, రోజు ట్విటర్‌లో ఫేస్‌బుక్‌లో అనేక ఫిర్యాదు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వౌలిక సదుపాయాల రంగంలో సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తము అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయిందని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, మరిన్ని చేయాల్సి ఉందని అన్నారు. డాక్టర్ రెడ్డీసీ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ మంచి ఆరోగ్యం ప్రజలకు అందించడం కోసం తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. పర్యావరణం, సమాజంలో సానుకూల ప్రభావం ఏర్పరిచేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని చెప్పారు. సైకుల్ సిఇఓ దీనానాధ్ హరపనహళ్లి మాట్లాడుతూ మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్న రెడ్డీస్‌ను భాగస్వామిగా కలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ట్రాన్సిట్ కనెక్టివిటీని పెంచడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యదాయక రవాణా ఎంపిక అవకాశాన్ని అందిస్తాయని, నగరాన్ని దేశంలోనే అత్యంత సైకిల్ స్నేహపూర్వక నగరంగా మార్చేందుకు రెడ్డీస్ భాగస్వామ్యం మరింతగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మెట్రోరైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ సాండీల్యా పాల్గొన్నారు.