రంగారెడ్డి

దారి దోపిడీ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, డిసెంబర్ 1: ఒక వ్యాపారికి చెందిన 19 లక్షల రూపాయలు కారులో తరలిస్తుండగా మీడియా రిపోర్టర్లు, పోలీసులు కలిసి దోచుకున్న సంఘటనలో అల్వాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కాలిస్టేబుళ్లను గురువారం బొల్లారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ మల్లేష్ కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన వ్యాపారి సంతోష్‌కు చెందిన 19 లక్షల రూపాయలు అతని మిత్రుడు అనిల్ ద్వారా బోయిన్‌పల్లి నుండి ఆర్మూర్‌కు తరలించాల్సి ఉంది. కాని అనిల్ ఎలాగైన మిత్రుని డబ్బును కాజెయ్యాలని పథకం వేసి సిద్దిపేటకు చెందిన భాను రాకేష్‌కు చెప్పటం, అతడు తన మిత్రులైన కార్తీక్ , చాంది శ్రీనివాస్‌కు చెప్పటం వారు సికింద్రాబాద్ అల్వాల్‌లో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ఉప్పల ప్రవీణ్‌కు తెలియజేశారు. వారు మిత్రులైన దీపక్ , సుమన్‌లతోపాటు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు సుధాకర్ రెడ్డి, ఎం.యాదగిరిలను సంప్రదించి డబ్బులు కాజెయ్యాలని పథకం రూపొందించారు. 19 లక్షల కొత్తనోట్లతో వెళ్తున్న కారును అల్వాల్ రైతుబజార్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంకుకు రప్పించి అక్కడ టాస్క్ఫుర్సు పోలీసులమని కారులో ఉన్న వారిని బెరిరించి వారి వద్ద ఉన్న 19 లక్షల రూపాయలు కాజేశారు. విషయం తెల్సిన వ్యాపారి సంతోష్ బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో కేసు బయట పడింది . అందుబాటులో ఉన్న వారిని అరెస్టు చేసి వారి నుండి 15 లక్షల రూపాయలు స్వాధీన పర్చుకున్నారు. ఈ కేసుకు సంబందించి అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి, ఎం.యాదగరిలను గురువారం అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. కేసును బొల్లారం సిఐ మహేందర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మల్లేష్ దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను రిమాండుకు తరలించినట్టు ఆయన చెప్పారు.