రంగారెడ్డి

రెండున్నరేళ్ళ పాలనలో ఎంతో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, డిసెంబర్ 1: గడచిన రెండున్నరఏళ్ళ పాలనలో గతంలో ఏ ప్రభుత్వ పాలకులు సాధించలేని అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలో కొనసాగుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మంత్రి తాండూరు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సాయంత్రం తాండూరులోని తన నివాసంలో మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాతోపాటు, తాండూరు నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌తో సంప్రదించి పలు ముఖ్యమైన నిర్మాణాత్మక పనులను సాధించుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తాండూరులో చేపడుతున్న ప్రధానమైన పనుల గురించి వివరించారు. తాండూరు పట్టణం చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం కోసం సర్వే పనులు సాగుతున్నట్టు, రింగ్ పనులకు రూ 80 నుంచి రూ 100కోట్ల వరకు అంచనాలు ఉన్నట్టు తెలిపారు. రింగ్ రోడ్ నిర్మాణానికి ముందు భూములు కోల్పోయే నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు వంటి ప్రక్రియలు పూర్తిచేశాక రోడ్డు పనులు ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా ముందుకు సాగేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తోలి రింగ్ రోడ్డు నిర్మాణం తాండూరుదే అని మంత్రి పట్నం చెప్పారు. అదేవిధంగా తాండూరు-వికారాబాద్ ఫోర్‌లైన్ రోడ్డు పనులకు రూ 42కోట్లు మంజూరు అయినట్టు, తాండూరు డివిజన్‌లోని కాగ్నాబ్రిడ్జి, నారాయణపూర్ బ్రిడ్జి, జివన్గీ బ్రిడ్జి వంటి వంతెనలు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నా వాటన్నింటి పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, బిటి రోడ్లు, గ్రామాల అంర్గత రోడ్లు త్వరలో పూర్తవుతాయన్నారు. బషిరాబాద్, కొట్‌పల్లి, తోర్మామిడి, యాలాల్ రూట్ల రహదారుల పనులు ప్రారంభిస్తున్నట్టు తాండూరు డివిజన్ రోడ్ల నిర్మాణాలకు రూ 4నుంచి 5 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు మంత్రి వివరించారు. రూ 500 కోట్లు రంగారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ పనులకు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. పేదలందరికీ ఇళ్ళు, దళితులకు భూములు ఇస్తామన్నారు.వికారాబాద్ జిల్లాలో 10వేల ఇళ్ళు కేటాయిస్తున్నట్టు మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు.గడచిన రెండున్నర ఏళ్ళక్రితం తాండూరు మున్సిపాలిటీ చైర్ ఫర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన కొట్రిక విజయలక్ష్మీని మార్చే విషయం పార్టీ నిర్ణయానుసారం ఉంటుందని మంత్రి తెలిపారు. గతంలో అధికార టిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల ఒప్పందం మేరకు రెండున్నరేళ్లు టిఆర్‌ఎస్, మిగిలినది ఎంఐఎం పార్టీ అభ్యర్థి చైర్‌పర్సన్‌గా వ్యవహరించేలా ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.