రంగారెడ్డి

బ్యాంకుల ముందు అవే పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చేవెళ్ల మండలంలోని ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు డబ్బుల కోసం బ్యాంక్‌ల్లో బారులు తీరుతున్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బిహెచ్, యాక్సిస్‌బ్యాంక్, బ్యాంక్ ఆఫ్-బరోడా, కెనరా బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లతో పాటు మండల పరిధిలోని ఆలూర్, కౌకుంట్ల తదితర బ్యాంక్‌ల్లో జనం ఉదయం నుంచే డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకుల్లో సరిపడా డబ్బులు లేక పోవడంతో ఖాతదారులకు కేవలం 2 వేల నుండి 4వేల వరకే ఇస్తున్నారు. దీంతో ప్రతిరోజు డబ్బుల కోసం బ్యాంక్‌ల చుట్టూ తిరగాలా? అని పలువురు ఖాతదారులు బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే తమ వద్ద నగదు చాలా తక్కుగా ఉందని, దీంతో అందరికీ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏటిఎంలో డబ్బులు ఏర్పాటు చేస్తే ఖాతాదారులకు ఇంత ఇబ్బంది ఉండదని పలువురు పేర్కొంటున్నారు.
పరిగిలో చిల్లర సమస్య
పరిగి: పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి చిల్లర సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుంది. పెద్ద నోట్ల రద్దుతో వంద నోట్ల చెలామణి ఎక్కువైయింది. డిమాండ్‌కు తగిన వంద నోట్లు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యాపారాలు చాల దెబ్బతిన్నాయి. మరికొందరు తప్పనిసరి పరిస్థితిల్లో పాతనోట్లను తీసుకుంటున్నారు.
వ్యాపారాలు దెబ్బతినడంతో దాని ప్రభావం మార్కెట్‌లో అందరి పై చూపుతున్నాయి. ఆసుపత్రులు, కిరాణ షాపులు, హోటళ్లు ఎక్కడ చూసిన చిల్లర డబ్బుల గురించి నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. రెండువేల నోటు తీసుకుని వచ్చిన వాటి చిల్లర దొరుకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నగదు రహిత లావాదేవిలను పోత్స్రహించడంతో కొందరు స్వైప్ మిషన్‌లతో చెల్లింపులు చేస్తున్నారు. వ్యాపార వర్గాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక పోతున్నారు. పాత నోట్లు సిబ్బంది తీసుకోమంటున్నారు. కనీసం ఈనెల 15వరకు చిల్లర మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తాయని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.