రంగారెడ్డి

సఫాయి కర్మచారి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల్లో పనిచేసే సఫాయి కర్మచారి పిల్లలకు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తోందని జిల్లా కలెక్టర్ డి.దివ్య వెల్లడించారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సఫాయి కర్మచారిలకు ఆర్థిక చేయూత అందించేందుకు ఒకటి నుండి పదో తరగతి డేస్కాలర్స్‌కు రూ.850, మూడో తరగతి నుండి పదో తరగతి వరకు వసతిగృహాల పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులకు రూ.1700 అందించనున్నామని చెప్పారు. అర్హులైనవారు ఆదాయ ధ్రువపత్రం, ఆధార్, జనన ధ్రువీకరణపత్రంతో నమోదు చేసుకునేందుకు పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్‌లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి మాజీద్, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎంకెఐ అలి పాల్గొన్నారు.