రంగారెడ్డి

మేడ్చల్ ఠాణాలో కాంగ్రెస్ నేతల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 2: మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి పని తీరుపై శుక్రవారం ఠాణా ఆవరణలో కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డికి చెందిన పట్టణంలోని ఓ భవనంలో హోటల్ వ్యాపారి లీజుకు తీసుకోవడంలో తలెత్తిన వివాదంలో పోలీసులు సంజీవరెడ్డి అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు. గురువారం శ్రీకాంత్‌రెడ్డిని పిఎస్‌కు పిలిపించిన పోలీసులు అతనితో అత్యంత అమానుషంగా ప్రవర్తించారని నాయకులు ఆరోపించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కెఎల్‌ఆర్.. కాంగ్రెస్‌కి చెందిన నాయకులతో కలిసి పిఎస్‌కు చేరుకుని సిఐ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌రెడ్డి ఏమి నేరం చేశాడని కాళ్లకు చేతులకు బేడీలు వేశారని కెఎల్‌ఆర్ నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయమై వెంటనే ఫోన్‌లో సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. డిసిపి స్థాయి అధికారితో విచారణ జరిపించాలని కోరారు. విషయం తెలుసుకున్న పేట్‌బషీరాబాద్ ఎసిపి అశోక్‌కుమార్ మేడ్చల్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఎసిపికి కాంగ్రెస్ నాయకులు సిఐ తీరుపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి వారెంట్ లేకుండా ఇళ్లలో సోదాలు నిర్వహించారని అంతేకాకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించిన మహిళలను సైతం బెదిరించారని ఎక్కువగా మాట్లాడితే మిమల్ని కూడా అరెస్టు చేస్తామని హెచ్చరించారని ఏసిపికి వివరించడంతో పాటు సిఐ వ్యవహారంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఆందోళనలో మండల పార్టీ అధ్యక్షుడు వరదారెడ్డి, నాయకులు బాలమల్లేశ్, కొండల్‌రెడ్డి, సుబ్బారావు, మోహన్, పోచయ్య, ప్రకాశ్‌రెడ్డి, దాత్రిక లింగం పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు పిఎస్ హైడ్రామా కొనసాగింది. కాగా ఈ విషయమై సిఐను వివరణ కోరగా తాను ఈ కేసులో ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదని చట్టబద్ధంగానే వ్యవహరించానని పేర్కొన్నారు. ఈనెల 17న సంజీవరెడ్డి అతని కుమారులపై కేసు నమోదైందని 21న నోటీసులు జారీ చేశామని 29న అరెస్టు చేశామని వివరించారు. తండ్రి సంజీవరెడ్డితో పాటు ముగ్గురు కుమారులపై కేసు నమోదైందని ఒకరిని మాత్రమే అరెస్టు చేశామని మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.

చేనేత హస్త కళలను ఆదరించాలి

కెపిహెచ్‌బి కాలనీ, డిసెంబర్ 2: చేనేత హస్త కళాకారులు రూపొందించిన వస్తువులను ఆదరించి వారిని ప్రోత్సహించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శనివారం వివేకానందనగర్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే గాంధీ స్థానిక కార్పొరేటర్ లక్ష్మీబాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత హస్తకళలను, చేతి వృత్తులను ఆదరించి కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
చేతివృత్తి కళాకారులు రోడ్డుపై పడకుండా వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు శివకుమార్‌ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు మాధవరం రామారావు, వెంకట్‌రావు, స్థానికులు పాల్గొన్నారు.