రంగారెడ్డి

క్రీడల్లో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 2: క్రీడలలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ గుర్తింపును సాదించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలోని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నివాసంలో రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులను శుక్రవారం ఎమ్మెల్యే అభినందించారు. ఈనెల 4 నుండి 6 వరకు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరుగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలలో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఘట్‌కేసర్ మండలానికి చెందిన క్రీడాకారులు రాజేష్ (కెప్టెన్), సాయినాధ్, అఖిల్‌గౌడ్, హరిష్, వెంకటేశ్, బాలికల జట్టుకు చెందిన ఐశ్వర్య (కెప్టెన్), హరిక, వౌనిక, నవనీత, గౌరి ఎంఫిక కావటం గర్హనీయమని అన్నారు. జిల్లా స్థాయి జట్టుకు ఘట్‌కేసర్ మండల నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపిక అయ్యేలా కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు తిరుమల్‌రెడ్డి అభినందనీయుడని చెప్పారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యనిస్తుందని అన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు క్రీడల ద్వార సులువుగా వస్తుందని పేర్కొన్నారు. గుర్తింపుతో పాటు మంచి ఉద్యోగవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కబడీ అసోసియేషన్ జిల్లా సభ్యులు రంగారెడ్డి, తిరుమల్‌రెడ్డి, నాగరాజు, కొండల్‌రెడ్డి, జహంగీర్, చంద్రసేనారెడ్డి ఉన్నారు.

భవిష్యత్ తరాలకు ఉపయోగ పడేలా పరిశోధనలు
ఘట్‌కేసర్, డిసెంబర్ 2: భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రతి విద్యార్థి పరిశోధనలు జరిపి వినుత్న ప్రయోగాలు చేయాలని డిప్యూటీ హెడ్ జియోసైకిల్ ఎసిసి సిమెంట్ లిమిటెడ్ ఉల్లాస్ వి. పార్లకర్ అన్నారు. మండల పరిధి వెంకటాపూర్ లోని అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ సివిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం జరిగిన జాతీయ స్థాయి రసాయనిక సాంకేతిక ఉత్సవ్-2కే16 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్‌లో ప్రపంచ వ్యాప్తంగా కెమికల్ ఇంజనీరింగ్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని కెమికల్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. లక్ష్య సాధన లేని చదువు వృథా అవుతుందని, సాదించాలనే తపన నిరంతరం ఉండాలన్నారు. రసాయనిక సాంకేతిక రంగానికి ప్రపంచ దేశాలు అత్యున్నత ప్రాధాన్యతనిస్తున్నట్లు అందుకనుగుణంగా కెమికల్ ఇంజనీరంగ్‌ను ఎంచుకోవాలని సూచించారు. కెమికల్ రంగ నిపుణులు మలిండ్ మురమ్‌కర్, డాక్టర్ విజయ్‌కాల్ లు మాట్లాడుతు రసాయనిక రంగానికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసిన దేశాలకు మాత్రమే మనుగడ ఉందన్నారు. ప్రతి విద్యార్థి రసాయనిక రంగంలో రాణించి వినూత్న ప్రయోగాలు చేసేందుకు కళాశాల యజమాన్యాలు సహకరించాలన్నారు. కళాశాల సినియర్ డైరక్టర్ డాక్టర్ ఎం భగవంతరావు మాట్లాడుతు అత్యున్నత ప్రతిభ కనపరుస్తు లక్ష్య సాధనకు శ్రమించే ప్రతి విద్యార్థి అన్ని రంగాలలో రాణిస్తారని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకుని, పరిశోధనలు చేసేందుకు ముందుకు వచ్చే ప్రతి విద్యార్థికి కళాశాల తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కెమికల్ విభాగాధిపతి డాక్టర్ ముకుందావాణి, డైరక్టర్ సివి రెడ్డి, ప్రిన్సిపల్ కెఎస్ రావు పాల్గొన్నారు.