రంగారెడ్డి

2019 ఎన్నికల్లో తెదేపాదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంట్నం, డిసెంబర్ 11: జరగబోయే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, జడ్పిటిసి పొట్టి అయిలయ్యతో కలిసి మాట్లాడుతూ గ్రామాల్లో ఆశించిన స్థాయి కంటే అత్యధికంగా సభ్యత్వ నమోదు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామగ్రామాన తెదేపా సభ్యత్వ నమోదుకు కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహాన్ని చూస్తుంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న విషయం స్పష్టమవుతోందని చెప్పారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర నాయకులు తాళ్ల మహేష్‌గౌడ్, మల్లేష్, ఆకుల సురేష్ పాల్గొన్నారు.

ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును మానుకోవాలి
కెపిహెచ్‌బికాలనీ, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టాలనుకునే ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును మానుకోవాలని జెఎన్‌టియు ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి సమీర్ అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేసి విద్యా ప్రమాణాలు పెంచి పరిశోధన రంగానికి తోడ్పడకుండా ప్రైవేట్ పెట్టుబడుదారులను ఆహ్వానిస్తూ విద్యను వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
పేద, మధ్య తరగతి విద్యార్ధులను ఉన్నత విద్యకు దూరం చేయకూడదని చెప్పారు. ఆధునిక యుగ ఆవిష్కరణలో యూనివర్సిటీలదే కీలకపాత్ర అని, అలాంటి యూనివర్సిటీల అభివృద్ధికి నిధుల కేటాయింపు చేయకుండా విద్యను ప్రైవేటీకరణ చేయాలని చూడడం దారుణమన్నారు. ఉన్నత విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రక్రియను అడ్డుకుంటామని, ప్రైవేట్ యూనివర్సిటీల అంశాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకోకుంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.