రంగారెడ్డి

ఎన్నికల్లో ప్రకటించిన వాగ్దానాలను అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, డిసెంబర్ 11: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ రెగ్యులరైజేషన్ పేరుతో నోటీసులు ఇచ్చి పేద, మధ్య తరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన నిలిచి చర్యలను విరమించుకునే వరకు పోరాటం చేస్తామని బిజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర కరుణాకర్ అన్నారు. గుడిమల్కాపూర్ డివిజన్‌లో శనివారం రాత్రి మెహిని ఫంక్షన్‌హాల్ వద్ద బిజెపి జనసభ నిర్వహించింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి, మోసగింపు చర్యలకు పాల్పడుతూ రెగ్యులరైజేషన్ పేరుతో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు నోటీసులు జారీ చేసి ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇళ్లు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా మరో రెండు సంవత్సరాలు కాలం గడుపుతూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఎన్నికల అనంతరం పేద, మధ్య తరగతి వారు ఇళ్లను సొంత డబ్బుతో నిర్మించుకుంటే వారికి రెగ్యులరైజేషన్ పేరుతో నోటీసులు ఇవ్వడం ఏమిటని అయన టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో పదమూడు సంవత్సరాల పైబడి నివసించే వారికి ఆ భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉంటాయని గతంలో కోర్టు తీర్పులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిని క్షుణ్నంగా పరిశీలించి చట్టపరంగా ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా రెగ్యులరైజ్ చేయాలని అయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయాలని అయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. అనంతరం రాష్ట్ర నాయకుడు అశోక్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు నీటి బిల్లులు, ఆస్తి పన్ను మాఫీ చేస్తున్నట్లు మభ్యపెట్టి ఎన్నికల అనంతరం నీటి బిల్లులు, రెండు వందల శాతం, ఆస్తిపన్ను పేరుతో అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మంచి బుద్ధి చెబుతారని అన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలు మానుకొని ప్రభుత్వం దిగిరాకపోతే తమ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా 13న ఆసిఫ్‌నగర్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణలో రాజ్యాంగం అమలు ఏదీ?: టిఎస్‌ఎఫ్

తార్నాక, నాచారం, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా రాజ్యాంగం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదని తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ నేతలు పేర్కొన్నారు. ఆదివారం డిసెంబర్ 11 ఓయులోని ఐసిఎస్‌ఎస్‌ఆర్ హాల్‌లో తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చరిత్ర పుస్తకావిష్కరణ జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణను తెలంగాణ అమరుడు ప్రసాద్ తల్లి రాధమ్మ ఆవిష్కరించారు. అక్టోబర్ 1998, 13న ఓయు, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కలిసి టిఎస్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. నీళ్లు నిధులు, నియామకాలు తెలంగాణకు దక్కాలని, తెలంగాణలోని విద్యార్థుల సీట్లు వారికే దక్కాలని, టిఆర్‌ఎస్ ఏర్పాటు కాకముందే టిఎస్‌ఎఫ్ ఏర్పాటైందన్నారు. తెలంగాణ భావజాల ప్రచారం ప్రజల్లో చేయడంలో ప్రజలను ఉద్యమానికి సన్నద్ధం చేయడానికి టిఎస్‌ఎఫ్ విశేషంగా కృషి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పౌరప్రజాస్వామిక హక్కులు అమలు కావాలంటే ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు కావాలని టిఎస్‌ఎఫ్ ఆనాడే కోరుతుందన్నారు. కాని రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణలో రాజ్యాంగం అమలయ్యే పరిస్థితి లేదు. విశ్వవిద్యాలయాలకు నిధులు లేవు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ సమాజం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నప్పటికీ కాని వారి ఆకాంక్షలు నెరవేరే వాతావరణం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత వనరులు తెలంగాణకు దక్కకుండా విదేశాలకు తరలివెళుతున్నాయని, మన వనరులు మనకు దక్కాలంటే తెలంగాణ పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలని ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ప్రొఫెసర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. పదునెనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటైన టిఎస్‌ఎఫ్ తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొందని, కేసులు జైళ్లు కార్యకర్తలు అనుభవించారన్నారు. అయినా ఎంచుకున్న లక్ష్యం కోసం రాజీపడకుండా టిఎస్‌ఎఫ్ పనిచేసిందని వివరించారు. భావి తరాలకు టిఎస్‌ఎఫ్ చరిత్ర అందించాలన్న లక్ష్యంతో ఈ చరిత్ర పుస్తకాన్ని అందించాలని సంకల్పించామన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆదివాసుల సమాధుల మీద ఏర్పాటైందని, ఏడు మండలాలను ఆంధ్రకు అప్పగించి పోలవరం నీటిలో ముంచారని వరవరరారావు తెలిపారు. మావోయిస్టుల ఎజెండానే తమ అజెండా అని చెప్పిన కెసిఆర్ అధికారంలోకి రాగానే ఎన్‌కౌంటర్‌లతో పాలన ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పాలుపంచుకున్నారు.

నేడు మిలాద్-ఉన్-నబీ
* మసీదుల ముస్తాబు
మేడ్చల్, డిసెంబర్ 11: మహ్మద్ ప్రవక్త (సఅస) జన్మదిన సందర్భంగా నేడు ముస్లింలు అత్యంత ఘనంగా నిర్వహించే మిలాద్-ఉన్-నబీ ఉత్సవాల కోసం పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలోని పలు మసీదులను చూడముచ్చటగా ముస్తాబు చేశారు. ఆయా మసీదులను రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి స్టేషన్ రోడ్డు వరకు ఆకుపచ్చని తోరణాలతో నెలవంక చుక్కతో కూడిన భారీ బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. నేడు (సోమవారం) ఆయా మసీదుల్లో ప్రత్యేక సమావేశాలు (జల్సాలు) ఏర్పాటు చేసి ప్రవక్త ఉపదేశాలతో పాటు ప్రవక్త జీవిత విశేషాలు ఇస్లాం మత వ్యాప్తికి చేసిన కృషి తదితర విషయాలను పలువురు మతపెద్దలు తమ ప్రసంగాల్లో వివరించనున్నారు. మానవాళి మనుగడ కోసం ఆచరించాల్సిన అంశాలను ప్రవక్త సూచించిన సూక్తులను ప్రసంగించనున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ముస్లింలు తమతమ ఇళ్లను కూడా అన్ని విధాలుగా శుభ్రం చేసి ప్రత్యేక ప్రార్ధనలను నిర్వహించడంతో పాటు పవిత్ర గ్రంథం ఖురాన్‌ను పఠించి ప్రత్యేకమైన వంటకాలు, తీపి వంటకాలు తయారు చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు.

ఉచిత వైద్య శిబిరాలు
ఎంతో ఉపయోగం
బాలాపూర్, డిసెంబర్ 11: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బడంగ్‌పేట్ నగర పంచాయతీ వైస్‌చైర్మన్ చిగురింత నర్శింహా రెడ్డి సూచించారు. ఆదివారం బడంగ్‌పేట్ నగర పంచాయతీ బాలాపూర్ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర, శ్రీ రాధిక మల్టీస్పెషాల్టీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చిగురింత నర్శింహారెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. వైద్యులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన సలహాలు, సూచనలు, మందులు అందజేయడం మంచి పరిణామమని అన్నారు. దాదాపు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా, విష్ణు తెలిపారు. అందులో 50మందికి ఉచిత సుగర్ పరీక్షలు చేశామని ఆయన అన్నారు. బాలాపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాధిక ఆసుపత్రిలో అతితక్కువ ఖర్చులో వైద్యం అందిస్తున్నట్టు డాక్టర్ విష్ణు పేర్కొన్నారు. అధునాతన పద్ధతిలో అన్ని సౌకర్యాలతో కూడిన మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి నెలకొల్పినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మహేశ్వరి జైహింద్, ఐ.శేఖర్, ఎ.దశరథ, డాక్టర్లు అప్రోజ్, మధు పాల్గొన్నారు.