రంగారెడ్డి

అనాథలను ఆదుకునేందుకు అందరి సహకారం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్: అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని ఆదరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చౌదరిగూడ మాజి సర్పంచ్ బైరు రాములుగౌడ్ అన్నారు.
చౌదరిగూడ పంచాయతీ వెంకటాద్రి టౌన్‌షిప్‌లో జాయ్ ఫౌండేషన్ అనాథాశ్రమం నిర్మాణానికి మాజీ సర్పంచ్ బైరు రాములుగౌడ్, ఎంపిటిసి సభ్యురాలు బైరు రమాదేవి మంగళవారం స్థలాన్ని విరాళంగా ఇచ్చి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది ఆదరణకు నోచుకోక అనాథలుగా మిగులుతున్నారని, వారిని ఆదరించి ప్రయోజకులను చేయటానికి తమ వంతు కర్తవ్యంగా ముందుకు వచ్చినట్టు తెలిపారు. అనాథలను చేరదీయకుండా వదిలేస్తే అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉంటుందని చేరదీసి ఆదరిస్తే మరొకరికి చేయుతనిచ్చే వారిగా మారుతారని తాము నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.
అనాథల సంక్షేమం కోసం టౌన్‌షిప్‌లోనే ఆశ్రమాన్ని నెలకొల్పేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తన తండ్రి బిక్షపతిగౌడ్ స్మారకార్ధం నిర్మించే అనాథాశ్రమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైరు లక్ష్మణ్‌గౌడ్, నర్సింహ్మగౌడ్, సహదేవ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్తిపన్ను బకాయిలపై రైల్వే అధికారితో కమిషనర్ భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 8: మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లకు కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి సైతం క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద మొత్తంలో బకాయిలు పడ్డ భారీ సంస్థల నుంచి పన్ను వసూలు చేసే అంశంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా రూ. 26 కోట్ల మేరకు పన్ను బకాయి పడ్డ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాతో కమిషనర్ మంగళవారం సికిందరాబాద్ రైల్వే జోనల్ ఆఫీసులో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసికి ఆస్తిపనే్న ప్రధాన ఆర్థిక వనరని వివరించారు. ఈ పన్ను ద్వారానే తాము ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇతర ముఖ్యమైన సేవలందించేందుకు వీలు కల్గుతుందని ఆయన వివరించారు. ఈ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు ఎన్నో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, నగరంలోని బకాయిదారులంతా సకాలంలో పన్ను చెల్లిస్తే ఈ ప్రతిపాదనలను సమర్థవంతంగా అమలు చేయవచ్చునని ఆయనకు వివరించారు. వీలైనంత త్వరగా ఆస్తిపన్ను చెల్లించాలని ఆయన రవీంద్రగుప్తాను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన రెండు,మూడురోజుల్లో రైల్వే అధికారులను జిహెచ్‌ఎంసి కార్యాలయానికి పంపిన ఆస్తిపన్ను విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో కమిషనర్‌తో పాటు నార్త్‌జోన్ జోనల్ కమిషనర్ హరిచందన తదితరులున్నారు.
మహిళలు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఘట్‌కేసర్, మార్చి 8: మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జర్నలిస్టు మంజులత కళానిధి అన్నారు. మండల పరిధి వెంకటాపూర్‌లోని సివిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా, సామాజికంగా, అర్ధికంగా ఎదగాలని, పురుషులకు దీటుగా ప్రతి రంగంలో రాణించాలన్నారు.
మహిళల రక్షణపట్ల ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఆచరణలో అంతంత మాత్రమేనన్నారు. ప్రతి మహిళ స్వయం సంరక్షణకు మొదటి ప్రాధాన్యత నివ్వాలన్నారు. మహిళల పట్ల వివక్షను పారదోలాలని, మగపిల్లను ఆస్తులుగా, ఆడ పిల్లలను అప్పులుగా చూడటం దారుణమన్నారు. ఆడ పిల్లలు తమ పర్సులో లిప్‌స్టిక్‌లకు బదులు పెప్పర్ స్ప్రేలు పెట్టుకోవాలని ఆమె సూచించారు. ఎక్కడ వివక్ష చూపినా అక్కడ ప్రతిఘటించేలా మహిళలు చైతన్యవంతులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ ఎం.్భగవంత్‌రావు, ప్రిన్సిపాల్ ఎం.ముత్తారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మల్లేష్, హెచ్‌ఓడి అనంతలక్ష్మి, కో ఆర్డినేటర్లు సారికచౌదరి, ప్రతిభ, కోమల్, సిపన్, అనుష, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లకోసం దరఖాస్తుల వెల్లువ
ఉప్పల్, మార్చి 8: అర్హులైన నిరుపేదలకోసం ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌రూం ఇళ్లకోసం దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. మీసేవ సెంటర్లలో దరఖాస్తు పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జనం గంటల కొద్దీ ఎండలో క్యూలో నిల్చొని నిరీక్షించాల్సి వస్తోంది. మంగళవారం రోజున ఊహించని విధంగా సుమారు వెయ్యిమంది రావడంతో రామంతాపూర్ మీ సేవ సెంటర్ సందడిగా మారింది. అయితే సెంటర్‌లో సిబ్బంది లేక సకాలంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వచ్చిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా దరఖాస్తులను స్వీకరించడానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో జనం పనులు మానుకుని నిత్యం గంటలకొద్దీ క్యూలో నిల్చున్నా అవకాశం దక్కడంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా శివరాత్రి పండుగను సైతం లెక్కచేయకుండా మీసేవ సెంటర్‌కు జనం వస్తుండటంతో పనిచేసే సిబ్బంది ఏమి చేయలేక నిత్యం కేవలం 20 మందికి మాత్రమే పని చేస్తామని కూపన్లు ఇచ్చి పంపిస్తుండటంతో వచ్చిన జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో పోలీసులు ఉన్నా తోపులాట జరగడంతో స్వల్పంగా కొందరు గాయపడినట్లు తెలిసింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని తహశీల్దార్, ఇతర అధికారులకు చెప్పినా తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
స్థల సేకరణ చేయాలి
డబుల్ బెడ్‌రూం ఇళ్లకోసం వెంటనే స్థల సేకరణ చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ జేసింది. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం కమిటీ కార్యదర్శి మనె్న నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ నియోజకవర్గంలో 4600 మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు స్థలం ఎక్కడో నిర్ధారణ చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రజలు ప్రభుత్వంపై డబుల్ బెడ్‌రూం ఇళ్లకోసం ఆశలు పెట్టుకుందని పేర్కొన్నారు. స్థలాలను సేకరించడం కాలయాపన చేస్తూ ఇండ్లకోసం దరఖాస్తులను స్వీకరిస్తూ ప్రజల్ని మభ్యపెట్టడమే తప్ప అమలులో జాప్యం చేయడమేమిటని ప్రశ్నించారు. సిపిఎం రామంతాపూర్ డివిజన్ కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, లక్ష్మిదేవి, రమాదేవి, వెంకటమ్మ, సురేఖ పాల్గొన్నారు.

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి
ఇబ్రహీంపట్నం, మార్చి 8: ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉన్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నగరపంచాయతీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళలు వంటింటి కుందేళ్ళుగా మారవద్దని సూచించారు. మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వంటింట్లో నుండి బయటికి రావాలని అన్నారు. అంతర్జాతీయంగా ఎంతోమంది మహిళలు దేశాలను నడిపించే స్థాయిలో ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. అంతరిక్షంలో, విద్య, వైద్యం వంటి అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, వారి సంక్షేమానికి అధికంగా నిధులు కేటాయిస్తోందని చెప్పారు. మహిళలను చైతన్య పరిచేందుకు చర్యలు చేపడుతోందని వివరించారు. మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు మరింతగా బలోపేతం చెందాలని, ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడి నిజమవ్వాలని అన్నారు. మున్సిపల్ శాఖ డిప్యూటి డైరెక్టర్ వాణిశ్రీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని సూచించారు. ముందుగా స్నేహ మహిళా బ్యాంకు ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు వాటర్ ఫిల్టర్, 20 పెట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్మన్ కంబాలపల్లి భరత్‌కుమార్, కమీషనర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు ఆబేద్, ఆకుల యాదగిరి, ఈగల రాములు, ఆకుల సురేష్, స్వప్న, సర్పంచ్ సుమతీఅర్జున్‌రెడ్డి, స్నేహ మహిళా బ్యాంకు అధ్యక్షురాలు భారతి, తెరాస నాయకులు వెంకటరమణారెడ్డి, బోసుపల్లి వీరేష్‌కుమార్, గుంటి కిరణ్, శంకర్ పాల్గొన్నారు.
నాగరికత నిర్మాతలు మహిళలు
నాగరికత నిర్మాతలు మహిళలేనని దీనిని ప్రతి మహిళ గుర్తెరగాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం (టిఎస్‌యుటిఎఫ్) రాష్ట్ర నాయకురాలు ప్రసన్నకుమారి, జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని యుటిఎఫ్ ఆధ్వర్యంలో హక్కులు, వేతనాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగా మహిళలు నడుచుకోవాలన్నారు. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని మహిళలంతా తీర్మానం చేయాలన్నారు. స్వతంత్రంగా విధులు నిర్వహించే హక్కును మహిళలకు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళల్లో ప్రశ్నించే తత్వం పెరగాలని, అన్ని రంగాల్లో ముందుకు రావాలని సూచించారు. బాలికలను తప్పకుండా చదివించాలని, వారి చదువే మన ఇంటికి వెలుగని గుర్తెరగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌యుటిఎఫ్ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, గాలయ్య, జంగమ్మ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధికి మహిళా శక్తి ఎంతో అవసరం
కాచిగూడ, మార్చి 8: దేశం అభివృద్ధి చెందాలంటే మహిళా శక్తి ఎంతో అవసరమని రాష్ట్ర రోడ్ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసి కళాభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా కండక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా సామాజికంగా మహిళలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ ప్రజలకు ఎంతో సేవనందిస్తున్న సంస్థ అని కొనియాడారు. రోజుకు కోటిన్నర రూపాయల నష్టల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జివి.రమణరావు, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు థామస్, అశ్వత్థామరెడ్డి, పురుషోత్తం, నాగరాజు, ఉషాకిరణ్ పాల్గొన్నారు.
ఇయు ఆధ్వర్యంలో..
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసిలో మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జివి. రమణారావు, ఆల్ ఇండియా శ్రామిక ఫోరం అధ్యక్షురాలు డా.జివి.విజయలక్ష్మీ, యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డా.కె.రాజిరెడ్డి, ఎస్.బాబు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఎస్.శైలజ, బి.జ్యోతి, మాధవి, రాధారాణి, వెంకటేష్‌గౌడ్, మురళీధర్, రాంరెడ్డి పాల్గొన్నారు.
మహిళలు మరింత పురోగాభివృద్ధి సాధించాలి
సికింద్రాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అభిషేక్ ఆధ్వర్యంలో సీతాఫల్‌మండి డివిజన్ మహమ్మద్‌గూడ రెడ్‌క్రాస్ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యురాలిని, ఇతర మహిళా సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాందీ మొదలుకొని సోనియాగాంధీ వరకు దేశానికి ఎంతో సేవ చేశారని అన్నారు. మహిళలు ఎందులోనూ తీసిపోలేరని శక్తివంతమైన మహిళలుగా నిరూపించారని అన్నారు. మహిళలు ఎంత పురోగాభివృద్ది సాధిస్తున్నా ఇంకా వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, అందుకే మహిళాలోకం ఐక్యంగా సమస్యలను అధిగమించడానికి ముందుకు సాగాలని అన్నారు. మరింతగా అన్ని రంగాల్లో పురోగాభివృద్ధి సాధించాలని కోరారు.
బంగారు తెలంగాణలో
మహిళలు భాగస్వామ్యం కావాలి
హైదరాబాద్: బంగారు తెలంగాణలో మహిళలు భాగస్వామ్యం కావాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునితామహేందర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సునీతారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళా సాధికారత, మహిళ చైతన్యం, మహిళా ప్రజాప్రతినిధులుగా పాలన వ్యవహారం మొదలైన అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేశారు. ఉద్యమంలో కేసిఆర్ గారికి అండగా నిలిచిన మహిళాలోకం బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, అంగన్‌వాడీల జీతం పెంపు, షీటీమ్ ఏర్పాటు, కల్యాణ లక్ష్మి, మూడు ఎకరాల భూమి సైతం మహిళ పేరున ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ మహిళాలోకం కేసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణాకు బాటగా నిలవాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, ఎమ్మెల్సీ జనార్థన్‌రెడ్డి, జిల్లా టిఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు స్వప్న, మున్సిపల్ చైర్మన్‌లు విజయలక్ష్మి, ధనలక్ష్మి, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.

మేయర్ నజరానా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 8: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలోని స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు నజరానా ప్రకటించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రవీంద్రభారతిలో సాయి అలేఖ్య సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేయర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌లతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన మేయర్ రామ్మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పాలక మండలిలో సగం కన్నా ఎక్కువ మంది మహిళా కార్పొరేటర్లున్నారని వివరించారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళా కార్పొరేటర్లు ఉండటంతో నగరంలో మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 17వేల పై చిలుకు స్వయం సహాయక బృందాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అంతేగాక, వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో రూ. వంద కోట్లు మ్యాచింగ్ గ్రాంటును అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను మేయర్ సత్కరించారు. ఇదిలా ఉండగా, జిహెచ్‌ఎంసిలో టౌన్‌లేవెల్ ఫెడరేషేన్లలో సభ్యులుగా ఉన్న వారిలో కూతుళ్లు ఉన్న మహిళా సభ్యులను జిహెచ్‌ఎంసి ఘనంగా సత్కరించింది. జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మహిళా దినోత్సవాలను నిర్వహించి ఒక కూతురికి జన్మనిచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలను సత్కరించారు. ఒకే ఒక కూతురున్న తమను ఈ ప్రాతిపదికన గుర్తించి, ప్రపంచ మహిళా దినోత్సవం రోజున సన్మానించటం పట్ల మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు మహిళా స్వీపర్లలో కూడా సీనియర్లను గుర్తించి పలు సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లు సత్కరించారు. శేరిలింగంపల్లి పరిధిలోని పిజెఆర్ స్టేడియంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి మేయర్ రామ్మోహన్ శ్రీదేవి దంపతులు హజరై, మహిళామణులను ఘనంగా సత్కరించారు.

మళ్లీ తెరపైకి మల్టీలెవెల్ పార్కింగ్!
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 8: మహానగరంలో మరోసారి మల్టీలేవెల్ పార్కింగ్ యార్డులు తెరపైకొచ్చాయి. వాహనాల పార్కింగ్ తలనొప్పిగా మారింది. నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేస్తే నేరుగా ఇంటికి జరిమానా వస్తోంది. రోజురోజుకి పెరుగుతూ ప్రస్తుతం నగరంలో వాహనాల సంఖ్య 40లక్షలకు పెరగటంతో పార్కింగ్ వసతి గగనంగా మారింది. ఈ క్రమంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఇప్పటికే కొన్ని మహానగరాలు సమకూర్చుకున్న మల్టీలేవెల్ పార్కింగ్ సముదాయాలను మహానగరం కూడా సమకూర్చుకోవాలని యోచిస్తోంది. కానీ వాస్తవానికి కూడా రెండు దశాబ్దాలుగా మహానగర పాలక సంస్థ అధికారులు ఈ మల్టీలేవెల్ పార్కింగ్ యార్డుల విషయాన్ని పదే పదే చెబుతున్నా, ఇప్పటి వరకు ఒక్కటి కూడా అందుబాటులోకి తేలేకపోయారు. ఇపుడు తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్ ఫిన్‌లాండ్ బృందంతో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, మల్టీలేవెల్ పార్కింగ్ యార్డులను అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌లు ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రతినిధుల బృందంతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగరంలో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రీకృత పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న పార్కింగ్ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు గాను ప్రస్తుతం నగరంలోని ఆబిడ్స్‌లోని జిహెచ్‌ఎంసి పార్కింగ్ యార్డు, ఐమాక్స్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలం, శిల్పారామం సమీపంలోని మరో ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఈ పార్కింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని మేయర్ ఫిన్‌లాండ్ బృందానికి సూచించారు. హైదరాబాద్ వంటి నగరం మల్టీలేవెల్ పార్కింగ్ యార్డులను సమకూర్చుకుంటే అక్రమ పార్కింగ్‌కు చెక్ పెట్టడంతో పాటు పార్కింగ్ కూడా కార్పొరేషన్‌కు ఓ ఆదాయ వనరుగా మారుతుందని ఫిన్‌లాండ్ బృందం మేయర్‌కు వివరించింది.
సమయాన్ని బట్టి ఛార్జీలు
ప్రస్తుతం మేయర్ ప్రతిపాదించిన మూడు ప్రాంతాల్లో ఫిన్‌లాండ్ ఉన్నతాధికారుల బృందం ఈ మల్టీలేవెల్ పార్కింగ్ యార్డులను అందుబాటులోకి తెస్తే, వాటికి ఛార్జీలు ఎలా వసూలు చేయాలన్న విషయంపై కూడా పాలకులు, అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సారించారు. నగరంలో పలు పార్కింగ్ వ్యవస్థల మాదిరిగానే వాహన పార్కింగ్ సమయాన్ని బట్టి ఛార్జీలు వర్తింపజేయాలని భావిస్తున్నారు.