తెలంగాణ

27 నుంచి తెలంగాణలో ఆర్టీసీ చార్జీల వడ్డన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజలపై భారం మోపాలన్న ఉద్దేశం లేనప్పటికీ ఆర్టీసీ బస్ చార్జీలను పెంచకతప్పడం లేదని, సంస్థను ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ రవాణాశాఖామంత్రి మహేందర్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాతో చెప్పారు. పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు 1.30 రూపాయలు, ఆ దూరం దాటితే రెండు రూపాయల చొప్పున పెంచామన్నారు. సిటీ బస్సులు, ఎసి, డీలక్స్ బస్సుల్లో చార్జీలను పది శాతం పెంచామన్నారు. ఈనెల 27 నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తాయన్నారు. కొత్తగా 1,200 బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. ఎపి, కర్నాటక,మహారాష్టల్ల్రో గత ఏడాదే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినా, తెలంగాణలో ఏడాది ఆలస్యంగా పెంచకతప్పడం లేదన్నారు.