క్రీడాభూమి

బిసిసిఐకి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే చివరి రెండు టెస్టులకు నిధుల కొరత ఏర్పడుతుందేమోన్న ఆందోళన నుంచి బిసిసిఐ బయటపడింది. ఈ మ్యాచ్‌లను నిర్వహించే సభ్య సంఘాలకు నిధులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతినివ్వడంతో ఊపిరి పీల్చుకుంది. లోదా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని లిఖిత పూర్వకంగా అంగీకరించిన సభ్య సంఘాలకు మాత్రమే చెల్లింపులు జరపాలని సుప్రీం కోర్టు ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, త్రిపుర, విదర్భ తప్ప మిగతా క్రికెట్ సంఘాలు ఇప్పటి వరకూ తమ సంపూర్ణ అంగీకారాన్ని తెలుపుతూ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు అందచేయలేదు. ఫలితంగా బిసిసిఐ వాటికి నిధులను విడుదల చేసే అవకాశం లేకుండాపోయింది. నాలుగో టెస్టు ముంబయిలో, చివరిదైన ఐదో టెస్టు చెన్నైలో జరగనుండా, ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ), తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) ఇంకా అఫిడవిట్‌ను దాఖలు చేయలేదు. ఫలితంగా చివరి రెండు టెస్టుల నిర్వాహణ సమస్యాత్మకంగా మారుతుందేమోనన్న భయం బిసిసిఐని వెంటాడింది. కానీ, ఆ రెండు సంఘాలకు 1.33 కోట్ల రూపాయలను విడుదల చేయవచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఊరట చెందింది. ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేకపోయనా, శుక్రవారం సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పును బట్టి, బిసిసిఐ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది.