క్రీడాభూమి

టైటిల్‌పై భారత్ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 7: స్వదేశంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న 11వ ఎఫ్‌ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు టైటిల్‌పై గురిపెట్టి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. 2001లో హోబర్ట్ (ఆస్ట్రేలియా)లో భారత్ చివరిసారి ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. నాటి జట్టులో ఆడిన గగన్ అజిత్ సింగ్, దీపక్ ఠాకూర్, యువరాజ్ సింగ్, ప్రభ్‌జోత్ సింగ్ సింగ్ ఆతర్వాత సీనియర్ జట్టులోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. అప్పటి నుంచి ఒకటిన్నర దశాబ్దాలుగా ఎంత కృషి చేస్తున్నా విజేతగా నిలవలేకపోతున్నది. అయితే, జర్మనీకి చెందిన వాలెంటైన్ అల్టెన్‌బర్గ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్తావ భారత జూనియర్ హాకీ జట్టు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నది. స్వదేశంలో టోర్నీ ఆడడం ఈసారి భారత్‌కు మరింత ఉపయోగపడనుంది. మొత్తం 16 జట్లు ఢీ కొంటున్న ఈ టోర్నీలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, కెనడా జట్లు ఉన్న గ్రూప్ ‘డి’ నుంచి బరిలోకి దిగుతున్నది. పూల్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, ఆస్ట్రియా, పూల్ ‘బి’లో నెదర్లాండ్స్, మలేసియా, బెల్జియం, ఈజిప్టు, పూల్ ‘సి’లో న్యూజిలాండ్, జర్మనీ, స్పెయిన్, జపాన్ జట్లు ఉన్నాయి. గురువారం కెనడాతో జరిగే మ్యాచ్‌తో భారత్ టైటిల్ వేటను మొదలు పెడుతుంది. మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఢీ కొంటాయి. కాగా, భారత్ 10వ తేదీన ఇంగ్లాండ్, 12న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. జట్టుకు హర్జీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు.