క్రీడాభూమి

రహానేకు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అతని కుడి చూపుడు వేలుగు గాయమైంది. దీనితో అతను మిగతా రెండు టెస్టుల్లో ఆడే అవకాశం లేదని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతని స్థానంలో జట్టులోకి మనీష్ పాండేను తీసుకున్నట్టు పేర్కొంది. కొంతకాలంగా రహానే ఫామ్‌లో లేకపోవడం అభిమానులను వేధిస్తున్నది. ఓపెనర్ మురళీ విజయ్ మొదటి టెస్టులో సెంచరీ చేసినప్పటికీ, ఆతర్వాత అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నాడు. రహానే కూడా అదే దారిలో నడుస్తున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్‌లో అతను వరుసగా 13, 1, 23, 26, 0 చొప్పున పరుగులు చేశాడు. అసలే ఫామ్‌ను కోల్పోయిన అతనికి ఇప్పుడు గాయం సమస్య కూడా తోడైంది. అతనికి విశ్రాంతి ఎంతకాలమన్నది ఇంకా స్పష్టం కాలేదు.
ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా ఫిట్నెస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మోకాలి గాయం అతనిని వెంటాడుతున్నది. కాలి వాపు ఎక్కువగా ఉండడంతో అతను నాలుగో టెస్టులో ఆడడం అనుమానంగానే కనిపిస్తున్నది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను సెలక్టర్లు ఆహ్వానించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు పరిస్థితిని బట్టి షమీని ఆడించేదీ లేనిదీ నిర్ణయిస్తామని బిసిసిఐ స్పష్టం చేసింది.
ఇంగ్లాండ్‌కూ అదే సమస్య..
భారత్‌కేగాక, ఇంగ్లాండ్ జట్టుకు కూడా గాయాల సమస్య తప్పడం లేదు. ఈ సిరీస్‌లోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీనేజ్ సంచలనం, యువ ఓపెనర్ హసీబ్ హమీద్ చక్కటి ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ అలస్టర్ కుక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అతను మోహాలీ టెస్టు ఆడుతున్నప్పుడు చేతి వేలికి గాయమైంది. దీనితో ఇంగ్లాండ్ సెలక్టర్లు అతని స్థానంలో కీటన్ జెన్నింగ్స్‌ను ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాలో జన్మించి, ఇంగ్లాండ్‌లో స్థిరపడిన జెన్నింగ్స్ ఎంత వరకూ హమీద్ స్థానాన్ని భర్తీ చేస్తాడో చూడాలి. కాగా, ఎడమచేతి వాటం స్పిన్నర్ జాఫర్ అన్సారీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అతను అందుబాటులో లేకపోవడంతో, లియామ్ డాసన్ జట్టులోకి వచ్చాడు. స్పిన్‌కు అనుకూలించే స్వభావం ఉన్న భారత్ పిచ్‌లపై అతను బాగా రాణిస్తాడని ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.