అంతర్జాతీయం

పాక్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 1: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పదేపదే కవ్వింపుచర్యలకు దిగుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్‌కు భారత్ సరైన బుద్ధిచెప్పింది. ఎల్‌ఓసి వద్ద భారత్ సైన్యం కాల్పులు జరిపి ఐదుగురు పాక్ రేంజర్లను మట్టుబెట్టింది. రాజౌరీ,పూంచ్ జిల్లాల్లో నౌషేరా, కృష్ణఘాటీ సెక్టార్‌లో గురువారం హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతాదళాల కాల్పుల్లో ఆరుగురు పాక్ రేంజర్లు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది. భారత శిబిరాల వైపుమోర్టర్లతో దాడికి ప్రయత్నించగా పూర్తి అప్రమత్తంగా ఉన్న భారత్ దళాలు వమ్ముచేశాయి. ఎదురుకాల్పులతో పాక్‌కు దీటైన బదులు ఇచ్చింది. భారత్ కాల్పుల్లో ఓ పాకిస్తాన్ పొరుడూ మృతి చెందాడు. నియంత్రణ రేఖ వద్ద పాక్ దుశ్చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. చొరబాట్లను ప్రోత్సహించడం, నిత్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గట్టిగా బుద్ధిచెప్పాలని నిర్ణయించింది. గత నెల 26న ఉరి సెక్టార్‌లో పాక్ చొరబాట్లను భారత్ భగ్నం చేసింది. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్(బిఏటి) సభ్యులు ఇద్దర్ని మట్టుబెట్టింది. మేనెల ఆరంభంలో పూంచ్ సెక్టార్‌లో ఇద్దరు భారత సైనికుల తలలునరికి పాక్ పైశాచికత్వాన్ని ప్రదర్శించింది.