క్రీడాభూమి

నిద్రాణ ప్రతిభకు దివిటీ ‘ఖేలో ఇండియా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశ యువతీ యువకులకు అన్ని క్రీడల్లోనూ క్రమశిక్షణాయుతమైన తర్పీదునిచ్చి వారిని తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఖేలో ఇండియాను మరి కొనే్నళ్ల పాటు విస్తరించాలని కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా భవిష్యత్‌లో మహిళల చాంపియన్‌షిప్‌లనూ చేరుస్తామని క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ మంగళవారంనాడిక్కడ ప్రకటించారు. ప్రస్తుతం ఖేలో ఇండియాలో 16 క్రీడలున్నాయని, వాటి సంఖ్యను క్రమంగా పెంచుతామని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాధోడ్ దీని తర్వాత కళాశాల స్థాయి క్రీడల్ని నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళా క్రీడలకు అన్ని రకాలుగా ప్రోత్సాహాన్నిస్తామని, ఇందుకోసం విడిగా చాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికే ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ క్రీడల్లో రాణించే అవకాశాల్ని కల్పించకపోతే క్రీడారంగంలో భారత్ రాణించే అవకాశం ఉండదని పేర్కొన్న ఆయన ‘ప్రతిస్కూలు విద్యార్థికీ ఖేలో ఇండియాలో ఆడాలన్న ఆసక్తిని కలిగించాలి. ప్రతి బాలుడూ తాను ఎంచుకున్న క్రీడలో హీరోగా మారే అవకాశం అందించాలి’అని ఉద్ఘాటించారు. ప్రస్తుతం జరుగుతున్న క్రీడా పోటీలో కనిపిస్తున్న ప్రామాణికత ఆనందాన్ని కలిగిస్తోందని, భవిష్యత్‌లో ఇది మరింత పదునెక్కే అవకాశం ఉంటుందని అన్నారు. అమెరికా కాలేజీ క్రీడల తరహాలో ఈ రకమైన పోటీలను దేశ వ్యాప్తంగా నిర్వహించాలని భావిస్తున్నామని, ఇప్పటికే పాదుగొల్పిన ప్రామాణికతతోనే భవిష్యత్‌లో ఖేలో ఇండియా క్రీడలు ముందుకు వెళతాయని రాధోడ్ అన్నారు. ప్రస్తుత ప్రామాణికత అంతర్జాతీయ స్థాయిలో లేకపోయినా, మూడు నాలుగేళ్లలో ఈ స్థాయిని కచ్చితంగా చేరుకోగలుగుతామన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు. నిజానికి వచ్చే ఏడాది నుంచే ఈ క్రీడల్ని ప్రారంభించాలని అనుకున్నామని, కానీ చివరికి ఈ ఏడాదే అంకుర్పారణ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ సంతృప్తికరమైన పోటీ ప్రామాణికతతోనే వీటిని మొదలు పెట్టగలిగామన్నారు. స్కూలు, కాలేజీ స్థాయి క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఖేలో ఇండియా రాజబాటే అవుతుందని స్పష్టం చేసిన ఆయన ‘ఒలింపిక్స్ వచ్చే వరకూ ఆగాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో క్రీడల్ని నిర్వహించే సత్తా సామర్థ్యం ఖేలో ఇండియాకు ఉన్నాయి. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’అని పిలుపునిచ్చారు. స్కూలు, కాలేజీ, కామనె్వల్త్, ఆసియా క్రీడలు ఇలా దేశ యువత వివిధ దశల్లో అన్ని రకాల క్రీడల్లో రాణించేందుకు, నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరచుకునేందుకు అవకాశం ఉంటుందని, అందుకు ఖేలో ఇండియా వేదిక అవుతుందని తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో ప్రతి క్రీడ ముగింపుసమయంలోనూ వెయ్యి మంది ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఎంపిక చేసి ఎనిమిదేళ్ల పాటు వారికి ఐదు లక్షల చొప్పున స్కాలర్‌షిప్‌లు ఇస్తామని చెప్పారు. 2024, 2029ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండాలన్నదే తమ అంతిమ ధ్యేయమని రాధోడ్ తెలిపారు.
ఆమె కలలు నెరవేరాయ్!
ౄ అకాడమీ ద్వారా బాక్సర్ల వెలికితీతకు మేరీ కోమ్ యత్నం
ఇంఫాల్, ఫిబ్రవరి 6: అకాడమీ నెలకొల్పడం ద్వారా ఎంతోమంది యువ బాక్సర్లను వెలికితీయవచ్చుననే అవకాశం కోసం ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన ఎం.సి.మేరీ కోమ్ ఎదురుచూస్తోంది. తన చిరకాల స్వప్నం నెరవేరేందుకు వీలుగా ఆమె తన స్వంత రాష్ట్రం మణిపూర్ పశ్చిమ జిల్లాలోని లాంగోల్ హిల్స్‌లో 33.3 ఎకరాల్లో నెలకొల్పిన బాక్సింగ్ రీజనల్ అకాడమీ పరిధిని విస్తృత చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ అకాడమీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలనుకున్న తన ఆశయం నెరవేరేందుకు ఆమె ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అకాడమీలో 45 యువ బాక్సర్లు ఉన్నారు. వీరిలో 20 మంది బాలికలు ఉన్నారు. దేశానికి అత్యుత్తమ బాక్సర్లను అందించాలనే తన చిరకాల కలను నెరవేర్చుకునే రోజు రానే వచ్చిందని మేరీ కోమ్ భర్త, అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ ఓన్‌లర్ కరోంగ్ అన్నాడు. 35 ఏళ్ల మేరీ కోమ్ ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ, ఆసియన్ చాంపియన్‌గా అవతరించింది. 2012లో లండన్ ఒలింపిక్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌గా ఖ్యాతి గడించింది. బాక్సింగ్ కోసం మణిపూర్‌తో సహా దేశంలో అన్ని వసతులతో కూడిన మరిన్ని అకాడమీలు రావాల్సిన అవసరం ఉందని మేరీ కోమ్ అభిప్రాయపడింది.
తమ అకాడమీలో అత్యాధునిక సౌకర్యాల కల్పనలో ఎలాంటి రాజీ పడలేదని ఆమె స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితమే అకాడమీ పరిధిని విస్తృతం చేశామని, ప్రధాని చేతుల మీదుగా దీనిని ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నామని ఆమె పేర్కొంది. అకాడమీ నెలకొల్పడడంతోనే సరిపెట్టుకోకుండా బాక్సర్లను అత్యుత్తములుగా తీర్చిదిద్దడంతోపాటు వారి వ్యక్తిగత సమస్యలను కూడా తీర్చేందుకు ఆమె ముందుంది. తమ అకాడమీలో శిక్షణ పొందుతున్న బాక్సర్లలో ఎక్కువమంది పేద కుటుంబం నుంచి వచ్చినందున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) 600 రూపాయల వంతున స్టయిఫండ్ ఇస్తున్నా, వారికి అవసరమైన ఆహారాన్ని కూడా అందించాలని అభ్యర్థించినట్టు డైరెక్టర్ తెలిపాడు.