క్రీడాభూమి

మహిళల క్రికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింబర్లే, ఫిబ్రవరి 6: దక్షిణాఫ్రికా జరుగుతున్న మూడు వనే్డ సిరీస్‌లలో భాగంగా ఇప్పటికే జరిగిన తొలి వనే్డ మ్యాచ్‌లో గెలుపు ద్వారా మంచి ఉత్సాహంతో భారత మహిళా జట్టు బుధవారం జరిగే రెండో వనే్డపై దృష్టి సారించింది. ఏడు నెలల విరామం తర్వాత భారత మహిళా జట్టు ఆడుతున్న వనే్డలలో విజయంతో త్వరలో జరుగబోయే ప్రపంచ కప్‌లో చోటుదక్కించుకునేందుకు కెప్టెన్ మిథాలీరాజ్ నేతృత్వంలోని జట్టు ఎంతో కృషిచేస్తోంది. తొలి వనే్డలో 88 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండో వనే్డలో మరింత రాణించేందుకు గట్టి పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లలో సత్తా చాటడం ద్వారా 2021లో నిర్వహించే ఐసీసీ మహిళ ప్రపంచ కప్‌లో స్థానం కోసం ఉవ్విళ్లూరుతోంది. తొలి వనే్డను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా గట్టి పట్టుదలతో ఆడడం ద్వారా జట్టులోని స్మృతి మంథానా 98 పరుగులు ఎదుర్కొని 84 పరుగులు చేయగా, కెప్టెన్ 45 పరుగులు చేసింది. జట్టులోని పేసర్ల ద్వయం జులాన్ గోస్వామి 24 పరుగులిచ్చి 4 వికెట్లు, శిఖా పాండే 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి అద్భుతాన్ని సృష్టించారు. ఈ ఇద్దరు పేసర్లతోపాటు లెగ్ బ్రేక్ బౌలర్ పూనమ్ యాదవ్ 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని 125 పరుగులకే చాపచుట్టేలా చేశారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న మిథాలీ సేన రెండో మ్యాచ్‌పై గట్టి పట్టు సాధించేందుకు తహతహలాడుతోంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డేన్ వాన్ నైకెర్క్ ఒక్కరే 41 పరుగులు చేసింది.
మిగతా జట్టు సభ్యులెవరూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పరాజయాన్ని మూటకట్టుకున్నారు. రెండో వనే్డ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకం కావడంతో పోరు హోరాహోరీగా సాగనుంది.