క్రీడాభూమి

కోహ్లీ వైఖరి మారడానికి ఓ మంచి మెంటర్ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 6: డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులను భయపెడుతూ ఆటపట్టించే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దే వ్యక్తి అవసరం ఉందని దక్షిణాఫ్రికా మాజీ కోచ్ రే జెన్నింగ్స్ అన్నాడు. కోహ్లీ అండర్-19లో ఆడినప్పటి నుంచి ప్రత్యక్షంగా స్వయంగా చూస్తూ వచ్చిన జెన్నింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్‌గా వ్యవహరించడంతో కోహ్లీలో ఎన్నో అంశాలను గమనించాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి ఇప్పటి కెప్టెన్ కోహ్లీ వరకు చూస్తే భారత క్రికెట్‌లో చాలా మార్పులు గమనించవచ్చునని అన్నాడు. మహేంద్ర సింగ్ ధోని నెమ్మదస్తుడు కాగా, కోహ్లీ అందుకు విరుద్ధమన్నాడు. ఎంతో కాలం నుంచి కోహ్లీని ప్రత్యక్షంగా చూస్తున్నందున డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లే యువ ఆటగాళ్లకు అతనంటే చాలా భయమని, ఆ సమయంలో వారిని అనునయించేందుకు మెంటర్ అవసరం ఉంటుందని అన్నాడు. యువకుడైన కోహ్లీ మిగతా క్రికెటర్లకు భిన్నంగా వ్యవహరిస్తున్నా అది కొంత సమయం వరకేనని, ఆ తర్వాత అతనే నెమ్మదిస్తాడని అన్నాడు.

రాటుదేలితేనే
అపార అవకాశాలు
ౄ యువ క్రికెటర్లకు బౌలింగ్ కోచ్
పరస్ హేంబ్రే హితవు
ముంబయి, ఫిబ్రవరి 6: అనుభవం లేని యువ పేసర్లు ఫస్ట్‌క్లాస్ స్థాయి మ్యాచ్‌లలో రాటుదేలితే భవిషత్‌లో ఎదురయ్యే అనేక సవాళ్లను ఢీకొనగలరని భారత అండర్-19 టీమ్ జట్టు బౌలింగ్ కోచ్ పరస్ హేంబ్రే అన్నాడు. ఐసీసీ అండర్-19లో భారత్ యువసేన ప్రపంచ కప్‌ను కైవసం చేసుకునేందుకు పరోక్షంగా దోహదపడినవారిలో ఒకడైన హేంబ్రే యువ క్రికెటర్ల ఎదుగుదలకు ఎంతో కిందిస్థాయి నుంచే రాణించాలని అభిలషించాడు. అండర్-19లో ప్రపంచ కప్ సాధించిన యువసేనలో పేసర్లు చూపిన తెగువ ప్రశంసనీయమన్నాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు అటువంటి ఆటతీరు ఎంతో అవసరమన్నాడు. ఫస్ట్‌క్లాస్ లెవెల్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లలో బాగా రాణిస్తే భవిష్యత్ ఎంతో బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, వాటిని ఒక సవాల్‌గా తీసుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చాడు.

సింగిల్స్, డబుల్స్‌లో

రాణించిన సింధు
ౄ ఆసియా టీమ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్
ఆలోర్ సెటార్(మలేసియా), ఫిబ్రవరి 6: ఒలింపిక్ రజత పతకం విజేత, స్టార్ పీవీ సింధు ఆసియా టీమ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్, డబుల్స్‌లో అద్భుతంగా రాణించింది. టీమ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 3-2 తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించింది. ముందుగా జరిగిన సింగిల్స్‌లో సింధు 21-12, 21-18 స్కోరు తేడాతో హాంకాంగ్‌కు చెందిన యిప్ పూ ఇన్‌పై విజయం సాధించి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. మహిళల డబుల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప, ప్రజక్తల జోడీ 22-20, 20-22, 10-21తో వింగ్ యుంగ్, టింగ్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన మరో మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీ కృష్ణప్రియ కూడా 19-21, 21-18, 20-22 చియింగ్‌హేయిన్‌మేయి చేతిలో ఓటమి పాలైంది. దీంతో భారత్ 1-2 తేడాతో వెనుకబడింది. మరో మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డితో జట్టుకట్టిన సింధు 21-15, 15-21, 21-14 విజయం సాధించింది. ఇక చివరిదైన మరో మహిళల సింగిల్స్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి మళ్లింది. హోరా హోరీగా సాగిన మూడు సెట్ల పోరులో భారత క్రీడాకారిణి రుత్విక గద్దె 16-21, 21-16, 21-13తో విజయం సాధించింది. దీంతో భారత్‌కు 3-2 ఆధిక్యత లభించింది. ఇక టోర్నమెంట్‌లో భాగంగా గురువారం భారత జట్టు జపాన్‌తో తలపడనుంది. యమగూచి, ఒకుహారాతో సింధు సేన తలపడనుంది. ఈ టోర్నీని మే 20 జరుగనున్న ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్‌కు క్వాలిఫయర్‌గా పరిగణిస్తారు.

సెక్యూరిటీ గార్డులకు అంటువ్యాధుల ముప్పు

ౄ వింటర్ ఒలింపిక్స్ విధుల నుండి తప్పుకున్న 1200 మంది

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 6: దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్ లో శుక్రవారం నుండి ఆరంభమయ్యే వింటర్ ఒలింపిక్స్‌కు అంతా సిద్ధమైందని చెపుకుంటున్న అంటువ్యాధులు ఒకపక్క, మరోపక్క ఎముకలు కొరికే చలే నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఇక్కడ నోరో వైరాస్ పట్టిపీడిస్తోంది. దీంతో దాదాపు 1200 మంది సెక్యూరిటీ సిబ్బంది విధుల నుండి తప్పుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన వారీలో 41 మంది గత ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. చలి అధికంగా ఉండటంతో నోరో వైరస్ మరింత వ్యాప్తి చెంది ఆహారం, నీటిలో కలవడంతో సెక్యూరిటీ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వింటర్ ఒలింపిక్స్ కమిటీ వెంటనే 900 మంది మిలటరీ సైనికులను రంగంలోకి దింపింది. ఈ నోరోవైరస్‌కు సంబంధించి పూర్తి విచారణ చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ కంపెనీకి చెందిన గార్డ్స్‌ను, ఉద్యోగులను పయాంగ్‌చాంగ్‌లోని అథ్లెట్స్ విలేజ్ యూత్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. చలి అధిగకంగా ఉండటంతో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒలింపిక్ నిర్వాహకులు ఆరోగ్య శాఖాధికారులను కోరింది.
9 నుంచి ఫెడరేషన్ కబడ్డీ
ముంబయి, ఫిబ్రవరి 6: ఈ నెల తొమ్మిది నుంచి ఫెడరేషన్ కప్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. పురుషులు, మహిళల విభాగాల్లో, వేర్వేరు కబడ్డీ కోర్టులపై ఈ పోటీలు జరుగుతాయని ముంబయి ఉపానగర్ కబడ్డీ సంఘటన్ తెలిపింది. మహిళల విభాగంలో హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, హర్యానా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర జట్లు తలపడతాయి. పురుషుల విభాగంలో ఈ రాష్ట్రాలతోటు సర్వీసెస్, ఉత్తరప్రదేశ్, ఇండియన్ రైల్వేస్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ జట్లు కూడా ఢీకొంటాయి. ప్రో కబడ్డీ ద్వారా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న అనూప్ కుమార్, మన్జిత్ చిల్లార్, సురేంద్ర నాడా, దీపక్ హూడా, వజీర్ సింగ్, వికాస్ దహియా, మోహిత్ చిల్లార్, రాజేష్ మోండల్, ప్రదీప్ నర్వాల్ తదితరులు ఈ టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతారు.