క్రీడాభూమి

క్రీడా ప్రతిభకు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడాంశాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) సత్కరించనుంది. రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రోత్సాహంతో పాటు వారికి సరైన శిక్షణ, నిష్ణాతులైన కోచ్‌లతో తర్ఫీదునివ్వడం కోసం ఎంతో కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్‌లో ఆశించిన నిధులను రాబట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్రామీణ స్థాయి నుండి అధిక సంఖ్యలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి విశేషంగా కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన అన్ని క్రీడా సంఘాలు, క్రీడాకారులు వివిధ టోర్నమెంట్‌లలో ఆయా క్రీడా సంఘాల తరపున ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయిలో నిర్వహించిన సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగంలో పతకాలు సాధించిన వారికి ఈ అవకాశం దక్కుతుంది. 2017-18 విద్యా సంవత్సరంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా లాల్‌బహదూర్ స్టేడియంలో జరుగనున్న కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నారు.
ఈ విషయంపై చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్‌రెడ్డి శాట్స్ అధికారులతో పాటు ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఎటీ) ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు తమ పూర్తి వివరాలను ఈనెల 8వ తేదీలోపు లాల్‌బహదూర్ స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 17న నిర్వహించే కార్యక్రమంలో కోచ్‌లకు కిట్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుందని, కార్యక్రమానికి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి టి.పద్మారావు, రాష్ట్ర క్రీడల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రభుత్వ సలహాదారు పాపారావు, శాట్స్ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఎటీ) అధ్యక్ష, కార్యదర్శులు కె.రంగారావు, ఎస్‌ఆర్.ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొంటారు. ఓఎటీ అనుబంధం కలిగిన క్రీడలకు సంబంధించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని శాట్స్ పేర్కొంది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రూ.250 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయాలని శాట్స్ చైర్మన్ కోరారు.

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్
అలీపురం వెంకటేశ్వర్‌రెడ్డి