క్రీడాభూమి

రికార్డుపై భారత్ కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్ టౌన్, ఫిబ్రవరి 6: కరేబియన్ గడ్డపై రెండు వనే్డలలో గెలుపుతో మంచి ఊపుమీద ఉన్న భారత్ క్రికెట్ సేన బుధవారం జరిగే మూడో మ్యాచ్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఆరు వనే్డల సిరీస్‌లో పోటీపడుతున్న ఇరు జట్లలో డర్బన్, సెంచూరియన్‌లలో జరిగిన రెండు మ్యాచ్‌లలో అఖండ విజయం సాధించడం ద్వారా ఇప్పటికే భారత్ ఆధిపత్యం దిశగా పయనిస్తోంది. ప్రత్యర్థి టీమ్‌లో గాయాలబారిన పడిన అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రస్తుతం జరుగబోయే మిగిలిన వనే్డలలో ఆడే అవకాశం లేనందున, మూడో వనే్డలో సైతం గెలుపుపై భారత్ విజయావకాశాలపై ప్రణాళిక సిద్ధం చేసుకుంది. గడిచిన రెండు వనే్డలలో భారత్ వరుసగా ఆరు వికెట్లు, తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. 1992-03, 2010-11 సంవత్సరాలలో నిర్వహించిన వనే్డ సిరీస్‌లలో దక్షిణాఫ్రికాతో ఆడిన భారత్ కేవలం 3-2, 5-2 మ్యాచ్‌లలో గెలుపుతో సరిపెట్టుకుంది. అయితే, ఇపుడు అందుకు భిన్నంగా ఉంది. ఆతిధ్య జట్టును గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఆరు వనే్డల సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా భారత్ యోచిస్తోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వనే్డ కంటే ముందుగానే ఏబీ డివిలియర్స్, రెండో మ్యాచ్‌కు కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ చేతివేలి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు. ఇపుడు బుధవారం జరిగే మూడో వనే్డలో మరో సభ్యుడు క్వింటన్ డి కాక్ ఎడమ చేతికి మణికట్టు గాయం కారణంగా ఆడే అవకాశం లేదు. ఇతని స్థానంలో ఇంతవరకూ ఎవరినీ ఎంపిక చేయలేదు. అయితే, స్పిన్నర్ హెన్రిచ్ క్లాసెన్‌ను మూడో వనే్డలో వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు.
గడిచిన రెండు వనే్డలలో భారత్ స్పిన్నర్లు యజ్వేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్ కలసి 13 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా రెండు వనే్డలలో పోయిన పరువును నిలబెట్టుకునేందుకు ఉన్నవారిలో పేసర్లు, బ్యాట్స్‌మెన్‌లను నమ్ముకుంది. డర్బన్, సెంచూరియన్‌లలో జరిగిన రెండు మ్యాచ్‌లలో ఓపెనర్లుగా దిగిన హషీమ్ ఆమ్లా, డి కాక్ వరుసగా 30, 39 పరుగులు చేశారు. జట్టులో భారత్ స్పిన్నర్లను సైతం ధీటుగా ఎదుర్కొని డుప్లెసిస్ 100 పరుగులు చేశాడు. మర్‌క్రం రెండు వనే్డలలో వరుసగా 21 బంతులు ఎదుర్కొని 2 పరుగులు, 11 బంతులు ఎదుర్కొని 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జట్టులోని మిడిలార్డర్ కూడా ఏమంతా రాణించలేదు.
ఇక భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా మూడో వనే్డలోకి దిగుతోంది. రెండు వనే్డలలో చూపిన తెగువతో కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, ఫీల్డింగ్‌లలో ప్రత్యర్థి కంటే భిన్నంగా ఉంది. దక్షిణాఫ్రిగా గడ్డపై ఇంతవరకు ఆడిన వనే్డలలో భారత్ వరుసగా మూడు వనే్డలలో గెలుపొందిన దాఖలాలు లేవు. దీనిని ఇపుడు తిరగ రాసేందుకు కోహ్లీ సేన శతధా ప్రయత్నాలు చేస్తోంది. మూడో వనే్డలోనూ విజయం సాధిస్తే గతంలో న్యూజిలాండ్‌పై విజయం ఘనతను మరోసారి లిఖిస్తుంది. 1992లో దక్షిణాఫ్రికాతో జరిగిన వనే్డలలో రెండు మ్యాచ్‌లను కోల్పోయి, ఒక మ్యాచ్‌తోనే భారత్ సరిపెట్టుకుంది.
ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో భారత్‌కు అన్ని విషయాల్లో కలిసి వస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు. సెంచూరియన్, కేప్ టౌన్‌లలో జరిగిన రెండు వనే్డలలో గెలుపు ద్వారా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది.

chitram...

న్యూఢిల్లీలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్‌లో పాల్గొనే రాజస్థాన్ క్రీడాకారులతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్