క్రీడాభూమి

ఎవరికీ తీసిపోని కెప్టెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రపంచ క్రికెట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఎవరికీ తీసిపోరని ఆయన నాయకత్వ పటిమ స్పూర్తిదాయకమని క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కోహ్లీ బాడీ లాంగ్వెజ్ కూడా ఆయన దూకుడుకు, ఆట తీరుకు అద్దం పట్టేదిగానే ఉంటుందని ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లయిన స్మిత్, రేజెన్నింగ్స్‌లు కోహ్లీపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన తీరేవేరంటూ అశ్విన్ పొగడ్తలు కురిపించాడు. భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా టూర్లో కోహ్లీ వ్యవహరించాడని పేర్కొన్న అశ్విన్ అత్యంత సమర్ధనీయ రీతిలోనే ఆయన తన జట్టుకు సారధ్యం వహించాడని చెప్పాడు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని పూర్తిస్థాయి ప్రతిభాపాటవాలను కనబరిచి ఏ మ్యాచ్‌నైనా నెగ్గాలన్న స్పూర్తిదాయక పట్టుదలి విరాట్‌దని ఆయన తీరు నిరంతరం ప్రత్యర్థులకు దడ పుట్టించేదేనని అన్నాడు.
ప్రతి అంశంలోనూ సానుకూల ధోరణి కనబరచటం, ప్రతికూలంగా ఆలోచించకపోవడమే కోహ్లీ నాయకత్వానికి వనె్న తెచ్చేదని అశ్విన్ పేర్కొన్నాడు. ఆయన వ్యవహార శైలీ, ఆటతీరు, ప్రోత్సాహక ధోరణి..అన్నీ కూడా జట్టులోకి ప్రతి ఆటగాడికి పూర్తిస్థాయి సామర్ధ్యంలో రాణించాలన్న ప్రేరణ కలిగించేదేనని అతడు తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా విరాట్ తాను అనుకున్నది సాధించాడని మరిన్ని వికెట్లు తీసుకోవాలన్న పట్టుదల చివరివరకూ అతడిలో కనిపించిందని అన్నాడు. ఆ టెస్ట్‌మ్యాచుల్లో తన ఆటతీరు గురించి మాట్లాడిన అశ్విన్‌‘ మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లలో నేను బాగానే బ్యాటింగ్ చేశాను. అయితే అనంతర పరిస్థితుల్లో ఆడలేకపోయాను. మొత్తమీద నేను కౌంటర్ అటాక్ చేయాల్సి వచ్చింది. అందులోనూ సంతృప్తికరంగానే రాణించాను’అని అశ్విన్ అన్నాడు. అయితే తన ఆటతీరుకు సంబంధించినంత వరకూ ఎవరికీ ఎలాంటి నిరుత్సాహం కలగకుండా తాను అనుకున్నది సాధించగలిగినట్టు యువ క్రికెటర్ పేర్కొన్నాడు. అయితే అనుకున్న స్థాయిలో వికెట్లు తీసుకోలేకపోవడం, క్యాచ్‌లను మిస్ చేయడం జరిగినా తన ఆటతీరు తనకు సంతృప్తిని ఇచ్చిందని అన్నాడు. అంతిమ ఫలితం దక్షిణాఫ్రికాకు అనుకూలంగానే వచ్చినా భారత్ జట్టు చివరివరకూ గట్టిపోటీని ఇవ్వగలిగిందన్నాడు. అటు కేప్‌టౌన్‌లోనూ ఇటు సెంచూరియన్‌లో కూడా చివరి బంతి వరకూ భారత జట్టు గట్టిపోటీనే కనబరిచిందని తెలిపాడు. అయితే ఆ రెండు టెస్టు మ్యాచ్‌లలో భారత్ టాస్ గెలిచిఉంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్న అశ్విన్‌‘ఓ జట్టుగా భారత ఆటగాళ్లు స్పూర్తిదాయకమైన రీతిలోనే రాణించారు. ఈ రకమైన ఆట తీరు ఇంగ్లాడ్ సిరీస్‌లో మరింతగా రాణించడానికి సరికొత్త స్పూర్తినే ఇస్తుంది’అని తెలిపాడు. జొహెనె్నస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో టీమిండియా ఆటతీరు అద్భుతమని ఆ మ్యాచ్‌లో గెలుపుతథ్యమన్న రీతిలోనే భారత్ ముందుకు సాగిందని ఆఫ్ స్పిన్నర్ తెలిపాడు.