క్రీడాభూమి

ముక్కోణపు వనే్డ సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్, ఫిబ్రవరి 7: న్యూజిలాండ్ కూడా పాల్గొంటున్న ముక్కోణపు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెల్చుకుంది. గ్లేన్ మాక్స్‌వెల్ మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు అజేయ శతకంతో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచి ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. దావీద్ మలాన్ 50 పరుగులు చేయగా, అలెక్స్ హాలెస్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెరి 22 పరుగులు సాధించారు. మాక్స్‌వెల్ రెండు ఓవర్లు బౌల్ చేసి, కేవలం పది పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఆస్టన్ అగర్ 15 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. బిల్లీ స్టాన్లాక్, కేన్ రిచర్డ్‌సన్, ఆండ్రూ టై, మాస్కస్ స్టొయినిస్ తలా ఒక్కో వికెట్ కూల్చారు.
మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు
ఇంగ్లాండ్‌ను ఓడించడానికి 156 పరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియా డేవిడ్ విల్లీ వేసిన మొదటి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్ (4), క్రిస్ లిన్ (9) వికెట్లను కోల్పోయింది. అయితే, సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మాక్స్‌వెల్ ఏమాత్రం తడబడకుండా ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. మూడో వికెట్‌కు 80 పరుగులు జత కలిసిన తర్వాత ఓపెనర్ ఆర్సీ షార్ట్ ఔటయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్న అతను రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. మాస్కస్ స్టొయినిస్ (6), ట్రావిస్ హెడ్ (6) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ, విజృంభణను కొనసాగించిన మాక్స్‌వెల్ సెంచరీ పూర్తి చేసి, ఆస్ట్రేలియాను గెలిపించాడు. 58 బంతులు ఎదుర్కొని 103 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచిన అతని స్కోరులో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, మాక్క్‌వెల్‌తోపాటు అలెక్స్ కారీ 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్లీ ఒక్కడే రాణించాడు. అతను మూడు ఓవర్లు బౌల్ చేసి, 28 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. సెంచరీ హీరో మాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 (దావీద్ మలాన్ 50, అలెక్స్ హాలెస్ 22, ఇయాన్ మోర్గాన్ 22, అస్టన్ అగర్ 2/15, గ్లేన్ మాక్స్‌వెల్ 3/10).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 (ఆర్సీ షార్ట్ 30, మాక్స్‌వెల్ 103 నాటౌట్, డేవిడ్ విల్లీ 3/28).