క్రీడాభూమి

సియోల్ చేరుకున్న ఉత్తర కొరియా ఛీర్‌లీడర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఫిబ్రవరి 7: ఉత్తర కొరియా ఛీర్‌లీడర్లు దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తమ అథ్లెట్లను ప్రోత్సహించడానికి 229 మంది ఛీర్‌లీడర్లుసహా మొత్తం 280 మంది బుధవారం సియోల్ విమానాశ్రయంలో దిగారు. ఒకే రకమైన దుస్తులు వేసుకొని, తలపై టోపీలు పెట్టుకొన్న ఉత్తర కొరియా బృందం ఉభయ కొరియా దేశాల మధ్యగల డీమిలిటరైజ్డ్ జోన్ మీదుగా, డొరాసన్ సరిహద్దును దాటి, దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ కోసం సియోల్ చేరుకున్నారు. ఇది వరకే ఉత్తర కొరియా కళాకారుల బృందం ఇక్కడికి చేరుకోగా, ఇప్పుడు ఛీర్‌లీడర్లు కూడా వచ్చారు. విమానాశ్రయంలో దిగిన వీరింతా నవ్వులు చిందిస్తూ, ఎంతో హుషారుగా కనిపించారు. 3మిమ్మల్ని కలుసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది2 అంటూ అక్కడ ఉన్న విమానాశ్రయ సిబ్బందిని ఆప్యాయంగా పలకరించారు. ఛీరింగ్ రొటీన్ ఏ విధంగా ఉండబోతున్నదని అక్కడే ఉన్న ఓ విలేఖరి ప్రశ్నించగా, ఒక ఛీర్‌గర్ల్ స్పందిస్తూ, 3వేచి చూడండి. ఇప్పుడే చెప్పేస్తే, వింటర్ ఒలింపిక్స్ జరిగే సమయంలో మేము చేసే విన్యాలపై ఆసక్తి ఏముంటుంది?2 అని ఎదురుప్రశ్న వేసింది. కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రూలింగ్ వర్కర్స్ పార్టీ ఎంతో కసరత్తు చేసిన తర్వాత ఛీర్‌లీడర్లను ఎంపిక చేసింది. ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఛీరింగ్‌లో వారి ప్రతిభను పరీక్షించారు. ఆతర్వాత వారు, వారి కుటుంబాలను గురించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు. అధ్యక్షుడు కిమ్‌కు, ప్రభుత్వానికి విధేయులుగా ఉంటున్నారా? లేదా? అనే కోణంలోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఎన్నో పరీక్షలు, వడబోతల అనంతరం దక్షిణ కొరియాకు వెళ్లే ఛీర్‌లీడర్లను ఉత్తర కొరియా అధికారులు ఎంపిక చేశారు. దక్షిణ కొరియాలో ఇంతకు ముందు, 2003లో జరిగిన ఆసియా క్రీడలు, 2005లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ తదితర ఈవెంట్స్‌కు కూడా ఉత్తర కొరియా ఛీర్‌లీడర్లను పంపింది. ఇప్పుడు పయాంగ్‌చాంగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు మరోసారి ఛీర్‌లీడర్లను దక్షిణ కొరియాకు పంపించింది. మొత్తం మీద వింటర్ ఒలింపిక్స్ వల్లరెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది.

ఫెడ్ కప్ టెన్నిస్
చైనా చేతిలో భారత్ ఓటమి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఫెడ్ కప్ ఆసియా, ఓషియానా గ్రూప్-1 పోటీల్లో భాగంగా బుధవారం చైనాను ఢీకొన్న భారత్ 1-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో 19 ఏళ్ల కర్మాన్ కౌర్ 2-6, 2-6 తేడాతో యఫాన్ వాంగ్ చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న లిన్ ఝూను 6-3, 6-2 తేడాతో ఓడించడంతో ఇరు జట్లు చెరొక విజయంతో సమవుజ్జీగా నిలిచాయి. అయితే, కీలకమైన చివరి డబుల్స్ మ్యాచ్‌లో ప్రార్థన థంబారే, అంకిత రైనా జోడీ 2-6, 6-7 తేడాతో యఫాన్ వాంగ్, జయావోజువాన్ యాంగ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. చైనాతో పోటీని కోల్పోయిన భారత్ గురువారం కజకస్తాన్‌ను ఢీ కొంటుంది. హాంకాంగ్‌ను 3-0 తేడాతో చిత్తుచేసిన కజకస్తాన్‌ను ఓడిస్తేగానీ, భారత్ ముందంజ వేసే అవకాశం ఉండదు.

క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
మైన్మార్, ఫిబ్రవరి 7: ఆసియా పారా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు సాధించి క్లీన్ స్వీప్ చేసే దిశగా భారత్ కృతనిశ్చయంతో ఉంది. భారత పారా సైక్లింగ్ జట్టు కోచ్ ఆదిత్య మెహతా నేతృత్వంలో భారత్ బహ్రెయిన్‌లో గత ఏడాది మూడు పతకాలను కైవసం చేసుకుంది. జట్టులో 25 ఏళ్ల అభిషేక్ షేఖు బంగారు పతకం సాధించగా, దివిజ్ షా కాంస్యం, హరీందర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. మళ్లీ ఇపుడు శుక్రవారం నుండి మైన్మార్‌లో జరుగబోయే పోటీలకు తమ జట్టు అన్నివిధాల సన్నద్ధమవుతోందని, తప్పనిసరిగా చాంపియన్‌షిప్ సాధిస్తామని కెప్టెన్ ఆదిత్య మెహతా ధీమా వ్యక్తం చేశాడు.