క్రీడాభూమి

స్నోబోర్డింగ్‌లో గెరార్డ్‌కు స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా), ఫిబ్రవరి 11: ఈసారి వింటర్ ఒలింపిక్స్‌లో టీనేజర్ రెడ్ గెరార్డ్ అమెరికాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 17 ఏళ్ల ఈ యువకుడు పురుషుల స్నోబోర్డింగ్ స్లోప్ స్టయిల్ విభాగంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి 87.16 పాయింట్లు సంపాదించి, టైటిల్ సాధించాడు. కెనడాకు చెందిన మాక్స్ పారట్ 80.10 పాయింట్లతో రజత పతకాన్ని అందుకోగా, అతన సహచరుడు మార్క్ మెక్‌మోరిస్ 78.01 పాయింట్ల సంపాదించి కాంస్య పతకాన్ని స్వీకరించాడు.
క్రాస్ కంట్రీ స్కీయింగ్ పురుషుల 30 కిలోమీటర్ల స్కీయథ్లాన్‌లో నార్వే క్లీన్‌స్వీప్ చేసింది. సీమెన్ హెగ్‌స్టాడ్ క్రూగెర్ (ఒక గంట, 16.20.0 నిమిషాలు), మార్టిన్ జాన్‌స్రుడ్ సాండ్‌బై (ఒక గంట, 6.28.0 నిమిషాలు), హాన్స్ క్రిస్టర్ హొలాండ్ (ఒక గంట, 16.29.9 నిమిషాలు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. నార్వే స్కీయర్లకు ఇతర దేశాల నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు.
పురుషుల స్పీడ్ స్కేటింగ్ 5,000 మీటర్ల ఈవెంట్‌లో స్వెన్ క్రెమర్ (నెదర్లాండ్స్) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతను 6 నిమిషాల, 09.760 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. కెనడా స్కేటర్ టెడ్ జాన్ బ్లూమెన్ 6 నిమిషాల, 11.160 సెకన్లతో రజత పతకాన్ని సాధించగా, 6 నిమిషాల, 11.618 సెకన్లతో నార్వేకు చెందిన స్వెర్ లూనే్డ పెడెర్సెన్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు.