సబ్ ఫీచర్

మహా శివోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు వుండే భారతదేశంలో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు స్వయంభూగా వెలిశాయి. తేజోవంతమైన ఈజ్యోతిర్లింగాలు ఎంతో మహిమాన్వితం కలిగి వున్నాయి. దేశం నలుమూలలా ఈ జ్యోతిర్లింగాలు వున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక జ్యోతిర్లింగం వుంది.
సోమనాధ జ్యోతిర్లింగం
భారతదేశం గుజరాత్ రాష్ట్రంలో మొదట్టమొదటి జ్యోతిర్లింగం సోమేశ్వర లింగం. ఈ క్షేత్రం చాలా మహిమలున్న పురాతమైన క్షేత్రం. ప్రభాస పట్టణంలో ఈ దేవాలయం ఉంది. దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెలను చంద్రునికిచ్చి పెళ్లిచేశారు. అయితే చంద్రుడు రేవతిపై ఎక్కువ ప్రేమ చూపటంతో మిగిలినవారు తండ్రి దక్ష ప్రజాపతికి ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన దక్ష ప్రజాపతి చంద్రునికి క్షయవ్యాధితో జీవించమని శపించాడు. అయితే నారద మహర్షి సలహాతో చంద్రుడు శివపంచాక్షరీ మంత్రాన్ని 40 రోజులు జపించాడు. పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేయమని చెప్పారు. ఈ విధంగా పూజించటంవల్ల మొదటి 15 రోజులు నా వరంవల్ల క్షయవ్యాధి వుండదని, మరో 15 రోజులు దక్ష ప్రజాపతి శాపంవల్ల క్షయవ్యాధితో క్షీణించగలవని శివుడు చెప్పాడు. చంద్రునికి సోముడు అనే పేరు వుంది. సోముడి చేత ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి సోమేశ్వర లింగం అని పేరు వచ్చింది. ఈ లింగానికి పూజలు చేస్తే సర్వ రోగాలు నశిస్తాయి.
.శ్రీశైల మల్లికార్జునస్వామి
ద్వాదశి జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైల మల్లికార్జున లింగం. ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణానదివద్ద ఈ క్షేత్రం వెలసింది. ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగం స్వరూపంలో స్వామి భక్తులకు దర్శనం ఇస్తాడు. ఇక్కడ అష్టాదశ పీఠాలలో ఒకటిగా వున్న భ్రమరాంబదేవి క్షేత్రం కూడా వెలసి వుండడం విశేషం. చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి, శివలింగాన్ని తెల్లటి పువ్వులతో పూజించటంవల్ల స్వామికి మల్లికార్జునుడని పేరు వచ్చింది. కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవంతుని నామస్మరణ, శ్రీశైలంలో దైవదర్శనం ముక్తిదాయకమని అంటారు. ఈ క్షేత్రం శిఖర దర్శనం సమస్త పాపహరణం, జన్మరాహిత్యమని వేదాలు చెబుతున్నాయి.
మహాకాళ లింగం
ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పాలిస్తున్న అవంతదేశపు రాజు ఉజ్జ్వలుడు, రాణి బుద్ధిమతి శివభక్తులు. రోజు శివపూజ చేస్తూ రాజ్యాన్ని పాలిస్తున్నారు. అయితే ఇతర దేశ రాజులు అవంత రాజ్యంపైకి దండయాత్ర చేస్తారు. రక్తపాతం ఇష్టంలేని రాజదంపతులు శివలింగం వద్ద పూజలు చేశారు. శివపార్వతులు ప్రతక్షమై దంపతులను దీవించి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అప్పుడు ఇతర దేశాల రాజులు మీకు సామంతులు అవుతారని చెబుతారు. దీంతో రాజు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. వెంటనే పరదేశపు రాజులు సామంతులు అవుతారు. రాజు వెంటనే సంతోషించాడు. ఉజ్జయిని క్షేత్రంగా భక్తుల పూజలు అందుకుంటుంది. కాళుడు పూజించటంవల్ల ఈ స్వామికి మహాకాళేశ్వర స్వామి అనే పేరు వచ్చింది.
ఓంకారలింగం
వింధ్య రాజు కోర్కె మేరకు ఈశ్వరుడు వింధ్య పర్వతంపై సువర్ణ రూప లింగంగా వెలసిన ఈ జ్యోతిర్లింగాన్ని ‘ఓంకారలింగమని’ అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాల్గవది అయిన ఓంకార లింగం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 80 కి.మీ దూరంలో వెలిసింది. ఈ లింగాన్ని అమరేశ్వర లింగమని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు తన ప్రమథ గణాలతో గౌరీదేవితో సహా ‘మేరువు’ అనే పర్వతంపై కొలువుదీరాడు. వింధ్యపర్వతం రాజు మేరువు పర్వత రాజుకన్నా ఖ్యాతి పోందాలని పంచాక్షరీ మంత్రం జపం చేస్తూ ఎత్తు పెరగటం ప్రారంభించాడు. అగస్త్యముని చేతులు అడ్డుపెట్టి పెరగటాన్ని నిలిపివేస్తాడు. పరమేశ్వరున్ని దర్శనం ఇవ్వమని అగస్త్యముని కోరటంతో వింధ్యరాజుకు శివుడు దర్శనమిస్తాడు. శంకరుడు వింధ్య రాజు కోర్కె మేరకు వింధ్య పర్వతంలో ఓంకారలింగంగా కొలువుదీరాడు. ఇప్పటికీ భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
కేదారేశ్వర లింగం
ఉత్తరప్రదేశ్‌లోని హిమాలయ పర్వతంలో వెలసిన కేదారేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవ లింగం. కేదారేశ్వర లింగం అతి పవిత్రమైనది.
పూర్వం నర నారాయణులు అనేవారు తపస్సుచేసి శంకరుని ప్రత్యక్షం పొందారు. ఆ నర నారాయణుని కోర్కె మేరకు పరమశివుడు ‘కేదార’ అనే పర్వతంపై కేదారేశ్వరునిగా వెలసి పూజలు అందుకుంటున్నాడు. పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శంకరాచార్యులు ఈ క్షేత్రం దర్శించుకొని పూజలు చేసారు.
భీమశంకర లింగం
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆరవ శివలింగం భీమశంకర లింగం మహారాష్టల్రోని పూనెకు సమీపంలో 75 మైళ్ళ దూరంలో వుంది. కామరూప రాజ్యంపై భీమాసురుడు అనే రాక్షసుడు, కామరూప రాజ్యంపై దండెత్తి రాజు సురక్షణను, రాణి సురణాదేవిని చెరసాలలో బంధించారు. అయితే రాజు, రాణి శివభక్తులు. వారు చెరసాలో కూడా మట్టి లింగానికి పూజలు చేస్తూ వున్నారు. అయితే భీమశంకరుడు శివపూజ చేయటానికి వీలు లేదని రాజదంపతులను కత్తి ఎత్తి చంపటానికి ప్రయత్నించటం జరిగింది. వెంటనే పరమశివుడు మట్టిలింగం నుంచి వచ్చి భీమాసురున్ని సంహరిస్తాడు. ఆ రాజ దంపతులు పూజించిన లింగమే భీమశంకర లింగమై పూజలందుకుంటుంది.
విశే్వశ్వర లింగం
రావణుని సవతి తల్లి కుమారుడైన వైశ్రవుడుని (కుబేరుడు) లంక రాజ్యం నుండి రావణుడు తరిమివేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అప్పుడు వైశ్రవుడు విశ్వకర్మ చేత కాశీనగరాన్ని నిర్మించుకొని పరమశివుని కోసం తపస్సు చేశాడు. అప్పుడు పార్వతీ, పరమేశ్వరులు ప్రత్యక్షమై అతని కోర్కె మేరకు అన్నపూర్ణ, విశ్వనాధ పేర్లతో కాశీలో వెలిశారు. ద్వాదశ లింగాలలో ఒకటి విశే్వశ్వరలింగం. కాశీ క్షేత్రంలో మరణించినవారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణ, విశే్వశ్వరున్ని సందర్శిస్తే సమస్త భోగాలు లభిస్తాయి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన విశాలాక్షీదేవి ఇక్కడే కొలువై వుండటం విశేషం. ఈ క్షేత్రం ప్రక్కనే గంగానది ప్రవహిస్తూ గంగా హారతులు అందుకుంటుంది.
త్రయంబకేశ్వర లింగం
గౌతమముని కోర్కె మేరకు శంకరుడు త్య్రయంబకేశ్వరునిగా ఈ క్షేత్రంలో వెలిశారు. గోహత్యా పాపం నుంచి విముక్తి పొందటానికి గౌతమ ముని నాసిక్ ప్రాంతంలో తపస్సు చేశారు. గౌతమ ముని కోర్కె మేరకు శివుడు ఒక నీటి బిందువును విడిచాడు. ఈ నీటి బిందువు నదిగా ప్రవహించి గౌతమ ముని యొక్క గోహత్య పాపం నుంచి విముక్తిని చేసింది. ఈ నదిని గౌతమనది అని పిలుస్తున్నారు. గౌతముని కోర్కె మేరకు శంకరుడు లింగ రూపంలో అవతరించి పూజలందుకుంటున్నాడు. ద్వాదశ లింగాలలో ఎనిమిదవ లింగం త్య్రయంబకేశ్వర లింగం నాసిక్‌కు 30 కి.మీ దూరంలో సహ్యగిరి శిఖరాలలో బ్రహ్మగిరిపై గోదావరి నది జన్మస్థలంలో త్య్రయంబకేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు.
వైద్యనాధం
పూర్వం ఈప్రాంతంలో ప్రజలు దీర్ఘవ్యాధులతో అల్లాడిపోతుంటే వైద్యనాధుడు అనే భక్తుడు శివునికోసం తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షం కాగా వైద్యనాధుడు ప్రజల రోగాలు తీర్చమని కోరగా శివుడు అలాగే చేశాడు. శివుడు తన భక్తుల పేరున వైద్యనాధునిగా లింగం రూపంలో ఆవిర్భవించాడు. ఆ లింగమే ద్వాదశ లింగాలలో జ్యోతిర్లింగంగా అవతరించినట్లు ఆలయ పూజారుల కథనం. వైద్యనాధ క్షేత్రం సందర్శిస్తే రోగాలు నయం కాగలవని భక్తుల విశ్వాసం. పర్లీలో క్షేత్రం వుంది. ఈ క్షేత్రాన్ని గోకర్ణమని, భూకైలాసమని కూడా పిలుస్తారు.
నాగేశ్వరస్వామి
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరస్వామి ఆలయం ఔండా వద్ద వుంది. ఈ క్షేత్రాన్ని ఔండా నాగనాధ్ అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం దక్షిణం వైపు వుండేది. భక్తుడు ఒకరు తపస్సు చేసి తూర్పు ద్వారం ప్రవేశం పొందినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ ఆలయంలో భూగర్భ ద్వారం వుంది. రెండు మెట్లు దిగిన తరువాత శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం పొందవచ్చును.
రామేశ్వర లింగం
బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో చిన్న ద్వీపం రామేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రంలోనే రామేశ్వర లింగం అనే జ్యోతిర్లింగం వుంది. రావణుని సంహరించటానికి కావాల్సిన శక్తి కోసం శివలింగాన్ని రాముడు పూజించి ప్రతిష్ఠించాడు. మొదటి ప్రాకారంలో రాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం దర్శనం ఇస్తుంది.
ఘృష్ణేశ్వర లింగం
సుధర్ముడు అనే బ్రాహ్మణునికి సుదేహయన భార్య కలదు. అయితే వారికి సంతానం లేకపోవటంతో సుదేహయన తన చెల్లెలు ఘృశ్శలనిచ్చి భర్తకు రెండవ పెళ్లి చేసింది. సుదర్మునికి, ఘృశ్శలకు కుమారుడు జన్మించాడు. దాంతో అసూయచెందిన సుదేహయన కుమారున్ని హత్యచేసింది. అయితే శివ పంచాక్షరీ జపం మంత్రంతో ధ్యానంలో వున్న ఘృశ్శలకు ఈ విషయం జ్ఞాన దృష్టితో చూచినా మనస్సు చలించకుండా అలాగే ధ్యానంలో వుండిపోవడంతో శివుడు ప్రత్యక్షమై ఘృశ్శలా కుమారున్ని బ్రతికించటం జరిగింది. శంకరుడు ఘృశ్శల పేరుమీదనే ఘృష్ణేశ్వరలింగం రూపం ధరించటం జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వ లింగమే ఘృష్ణేశ్వర లింగం. ఈ లింగం మహారాష్టల్రో ఎల్లోరా గుహలకు దగ్గరలో వుంది. ఈ నాటికి భక్తుల పూజలు అందుకుంటోంది.

- తెలుగు ఈరన్న, ఆదోని