క్రీడాభూమి

ఫెడ్ కప్‌తో యువతకు మంచి ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ambien medication zolidime

http://artkommunalka.com/buy-klonopin-online-2467 న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఇటీవల ప్రారంభమైన ఫెడ్ కప్‌లో భారత్‌కు చెందిన క్రీడాకారిణి అంకిత రైనా ఆటతీరు బాగా ఉందని, దీని తర్వాత జరిగే పోటీలో మరింత కలిసివచ్చే అవకాశం ఉందని ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. గత వారం జరిగిన ఆసియా/ఆసియానియా గ్రూప్-1లో భారత్ 2-0తో చైనాపై విజయం సాధించింది. ‘ఫెడ్ కప్‌లో భారత్ క్రీడాకారులు ఎప్పుడూ ఒంటిచేత్తో తిరిగి వస్తున్నారు. అయితే, ఇపుడు మంచి టాలెంట్ ఉన్న యువత ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి’ అని ఆమె వ్యాఖ్యానించింది. తొలి రౌండ్‌లో అంకిత రైనా చూపిన ప్రతిభతో రానున్న రోజుల్లో వంద మంది ఉన్న పోటీ మనకు ఆశించిన మేలు జరుగుతుందని పేర్కొంది. ఒకవేళ భారత్ ఆటగాళ్లు రిక్తహస్తాలతో తిరిగి వచ్చినా దానిని సానుకూల దృక్పథంతో ఆలోచించాలని ఆమె యువతకు సూచించింది. ఇదిలావుండగా, తన తర్వాత తనకన్నా బాగా ఆడే క్రీడాకారిణి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని అంది. టెన్నిస్‌లో గెలుపు కోసం తాను ఎల్లప్పుడూ ఆరాటపడుతుంటానని, బహుశా ఫ్రెంచ్ ఓపెన్‌తో తన క్రీడా జీవితాన్ని ముగించాలనుకుంటున్నా మళ్లీ ఆడే అవకాశం ఉండొచ్చని ఆమె వ్యాఖ్యానించింది. ప్రముఖ టెన్నిస్ స్టార్లు సెరెనా విలియమ్స్, మారియా షరపోవా వంటివారు మళ్లీ రంగంలో పుంజుకుంటున్న విషయంపై సానియా మీర్జా మాట్లాడుతూ మహిళా టెన్నిస్‌లో నమ్మశక్యంకాని ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని పేర్కొంది. ఎంతోమంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల ర్యాంకులు తరచూ మారుతుండడం ఇందుకు నిదర్శనమని అంది.