క్రీడాభూమి

11వ ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై, ముంబయి ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏప్రిల్ 7న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో మొదలుకానుంది. ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులను పొందిన స్టార్ ఇండియా సూచన మేరకు మ్యాచ్‌ల సమయాలను మారుస్తున్నట్టు వచ్చిన వార్తలకు ఐపీఎల్ కమిటీ తెరదించింది. గతంలో జరిగినట్టుగానే డే మ్యాచ్‌లు సాయంత్రం నాలుగు గంటలకు, డే/నైట్ మ్యాచ్‌లు రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతాయని కమిటీ తెలిపింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న చెన్నై మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టడంతో, ముంబయితో జరిగే తొలి మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా, ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ వేదికలను ఇంకా ఖరారు చేయలేదు. అయితే, మొదటి క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్‌లు వాంఖడే స్టేడియంలో మే 22, 27 తేదీలలో జరుగుతాయి.

రబదాకు
జరిమానా
దుబాయి, ఫిబ్రవరి 14: పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన ఐదో వనే్డలో భారత బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఔటైనపుడు అతనిని హేళన చేయడమేగాక హెచ్చరిస్తున్న భంగిమలో నిల్చున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబదాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతాన్ని జరిమానాగా విధించినట్టు ఐసీసీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.