క్రీడాభూమి

వింటర్ ఒలింపిక్స్ స్లాలమ్ విజేత ఫ్రిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 16: వింటర్ ఒలింపిక్స్ మహిళల స్లాలమ్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో అమెరికా స్టార్ స్కీటర్ మిఖేల్ షిఫ్రిన్ విఫలమైంది. పోటీకి ముందు అనారోగ్యానికి గురై, వాంతులు చేసుకున్న ఆమె పతకాల వేటలో విఫలమైంది. ఈ పోటీల్లో స్వీడన్ స్కీయర్ ఫ్రిదా హాన్స్‌డోటర్ స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఒక గంట, 38.63 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసింది. స్విట్జర్లాండ్ స్కీయర్ వెన్డీ హోల్డెనర్ (ఒక గంట, 38.68 నిమిషాలు) రజతాన్ని సాధించింది. కాతెరీన గాల్‌హబర్ (ఆస్ట్రియా) ఒక గంట, 38.95 నిమిషాలతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అనారోగ్యానికి గురైన షిఫ్రిన్ ఒక గంట, 39.03 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి, నాలుగో స్థానానికి పరిమితమైంది. జెయింట్ స్లాలమ్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆమె, స్లాలమ్‌లోనూ విజేతగా నిలిచే ప్రయత్నంలో విఫలమైంది.
ఆల్‌పైన్ స్కీయింగ్: పురుషుల సూపర్-జీ ఈవెంట్‌లో ఆస్ట్రియా స్కీయర్ మథియాస్ మేయర్ టైటిల్ సాధించాడు. అతను ఒక గంట, 24.44 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేశాడు. బీట్ ఫెన్జ్ (స్విట్జర్లాండ్) ఒక గంట, 24.57 నిమిషాలతో రజతం, కెటిల్ జాన్స్డ్ (నార్వే) ఒక గంట, 24.62 నిమిషాలతో కాంస్య పతకాలను గెల్చుకున్నారు.
పురుషుల క్రాస్ కంట్రీ 15 కిలోమీటర్ల ఫ్రీస్టయిల్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన డారియో కొలొగ్నా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతను గమ్యాన్ని 33.439 నిమిషాల్లో చేరుకున్నాడు. సీమెన్ హాగ్‌స్టాడ్ క్రూగర్ (నార్వే/ 34.022 నిమిషాలు), డెనిస్ స్పిట్సోవ్ (ఐఓసీ పతాకం కింద పోటీ చేసిన రష్యా స్కీయర్/ 34.069 నిమిషాలు) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు.
మహిళల ఫ్రీ స్టయిల్ స్కీయింగ్‌లో హన్నా హస్కోవా (బెలారస్), జాంగ్ జిన్ (చైనా), కాంగ్ ఫాన్జూ (చైనా) మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు.
20 దేశాలకు చెందిన 30 మంది పోటీపడిన పురుషుల స్కెల్టన్ ఈవెంట్‌ను దక్షిణ కొరియాకు చెందిన యున్ సింగ్ బిన్ గెల్చుకున్నాడు. ఐఓసీ పతాకం కింద పోటీలో ఉన్న రష్యా స్కెల్టర్ నికితా ట్రెగ్బోవ్, గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డామినిక్ పార్సన్స్ వరుసగా రజత, కాంస్య పతకాలను