Others

ఏకాత్మలు శివకేశవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మనాభ
11.పాల కడలిలో పన్నగ తల్పమందు
లీల పవళించి జగములు నేలు తండ్రి
పంకజాసన జనక వో పద్మనాభ
భక్తవత్సల సర్వేశ పరమ పురుష

దామోదర
12.యజ్ఞకర్తవు భోక్తవు యజ్ఞమీవు
ఉదరమందున జగముల పదిల పరచు
కున్న దామోదరా మము గన్న తండ్రి
వందనములయ్య జగదీశ విమల చరిత

సంకర్షణ
13.ఆదిశేషుని యంశతో నందు నింట
పడది రోహిణి నోముల పంట వౌచు
నవతరించిన సంకర్షణాఖ్య నిన్ను
రమణుడవు గాన నిల బలరాముడంద్రు

వాసుదేవ
14.్భమి భారము భోగొట్ట భూతములమున
దేవకీ వసుదేవుల తపఫలమ్ము
గా జనించితి వష్టమ గర్భమందు
వాసుదేవుడవై వైరి వాసి జెడగ

ప్రద్యుమ్న
15.్భవుని నేత్రాగ్ని భస్మమై భావజుండు
నంద నందనునకు నందనుండుగా జ
నించె తండ్రికి ప్రతి రూపమంచు జనులు
మోదమొందగ ప్రద్యుమ్న నాముడౌచు