కృష్ణ

రైతులకు ఏమాత్రం అన్యాయం చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఫిబ్రవరి 21: ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఏమాత్రం అన్యాయం చేయకుండా, రైతుల అభీష్టం మేరకు ప్రభుత్వ అవసరాలకు రైతుల నుండి భూములు సేకరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ తెలిపారు. మల్లవల్లిలోని ఎపీఐఐసీ పారిశ్రామిక వాడకు వెళ్ళే రహదారి ఏర్పాటుకు సంబంధించి భూసేకరణకు అవసరమైన భూములను బుధవారం ఆమె పరీశీలించారు. మండలంలోని మీర్జాపురం ఎంఎన్‌కె రహదారి నుండి 1.4 కిలోమీటర్లు, బాపులపాడు మండలంలోని 2.6 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. రహదారి ఏర్పాటుకు సుమారు 100 మంది రైతుల నుండి 40 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. ఈ సందర్బంగా రైతులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జేసీ విజయ్‌కృష్ణన్ మాట్లాడుతూ రైతులను ఏమాత్రం నష్టపడకుండా నష్టపరిహారంను ప్రభుత్వం అందజేస్తుందని, ఏమైన ఇబ్బందులు, సూచనలు, సమస్యలు ఉంటే నేరుగా ఆర్డీవో కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. రైతులకు త్వరలో నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంట నూజివీడు రెవిన్యూ డివిజన్ అధికారి చెరుకూరి రంగయ్య, తహశీల్దార్ విక్టర్‌బాబు, ఎంపిపి టీ శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రమేష్‌తో పాటు పలువురు రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.