కృష్ణ

ఉద్యమాన్ని అణచివేసేదిశగా ప్రభుత్వ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి: కాపుల రిజర్వేషన్ ఉధ్యమాన్ని అనచివేసేదిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కాపులు చేపట్టిన శాంతియుత ప్రదర్శనలకు సైతం అనుమతులను ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని జిల్లా కాపునాడు అధ్యక్షుడు బత్తుల ఆదినారాయణ అన్నారు. స్థానిక నాగార్జుననగర్‌లోని తెలగ హాస్టల్‌లో సత్తెనపల్లి నిమోజకవర్గస్థాయి కాపునాయకులు ఆదివారం జెఏసి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాపు జెఏసి చైర్మన్ తోట రామతిరుపతిరావు అధ్యక్షత వహించారు. కాపు జెఏసి ఆధ్వర్యంలో నాయకులందరూ వౌనప్రదర్శనగా వెళ్ళి తాలూకా సెంటర్‌లో మానవహారం ఏర్పాటుచేసి నిరసన తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. ముందుగా రంగా విగ్రహానికి నాయకులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ప్రదర్శనగా బయలుదేరిన నాయకులను ముందుగానే హాస్టల్ వద్దకు చేరుకున్న సాయుధ పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల విజ్ఞప్తి మేరకు తెలగ హాస్టల్‌లోనే వౌనప్రదర్శనచేసి పోలీసుల వైఖరిపట్ల, ప్రభుత్వ అణచివేతపట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పగడాల సాంబశివరావు, బూసి సుబ్బారావు, ఆవుల వెంకటేశ్వర్లు, సోమిశెట్టి సుబ్రహ్మణ్యం, తోట శంకర్, సదనం హరి, పెద్దింటి చిట్టి, ఆకుల హనుమంతరావు, గుడిపూడి రామకోటయ్య, బండి వేణు, దాసరి తిరుపతిరావు, జె ఏసి సభ్యులు అమ్మిశెట్టి కోటేశ్వరరావు, గుడిపూడి నాగేశ్వరరావు, రాజుపాలెం మండల కాపునాయకులు వేమూరి శ్రీనివాసరావు స్థానిక కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు.