శ్రీవిరించీయం

దుంపలు అమ్ముకునే ముసలి దుర్మార్గపు మనమడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మధురవాడ నుంచి పాత పోస్ట్ ఆఫీసు వెళ్ళే ఇరవై అయిదో నెంబరు సిటీ బస్సు ఆ సెంటర్‌లో ఆగడంతో దిగింది గౌరమ్మ. బస్సులోంచి ఎవరో అందించిన తన పెండలం దుంపల గంపని మరెవరి సాయంతో తలమీదకెత్తుకుని జగదాంబ సినిమా హాలు ముందున్న బస్‌స్టాపు ఎడం పక్కన తను రోజూ కూర్చుండే చోటుకి వచ్చి చేరింది. గొరుసు జగదీశ్వరరెడ్డి వ్రాసిన కథానిక ‘జగదాంబ జంక్షన్’లో సన్నివేశం ఇది. గౌరమ్మ స్థావరం చేసుకున్న చోటు జగదాంబ సెంటర్ పేవ్‌మెంట్‌లో ఓ భాగం. గౌరమ్మ యిప్పటికి నలభై యేళ్ళు పైబడి అక్కడే పెండెలం దుంపలు, ముక్కలు అమ్మకం చేసుకుంటూ కొడుకును, కోడలును, మనుమడిని పోషించుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఆ వాతావరణం ఆమెకు కొత్త కాదు. ‘మానవ సంబంధాలపట్ల కూడా ఒకరకమైన చులకన భావమే. లోకం డబ్బుచుట్టూ తిరుగుతూ ప్రేమలకీ ఆత్మీయులకీ అతీతం అయిపోయిందని ఏనాడో నిర్ణయం చేసుకుంది గనుక, దానికి తగ్గట్టుగానే జీవనం సాగిస్తోంది ఆమె. పెండలం దుంపల అమ్మకం- దానిలో వున్న ట్రేడ్ సీక్రెట్స్ అన్నీ గౌరమ్మకు అత్తగారు నేర్పింది, ఈ వ్యాపారాన్ని ఆమెకు వారసత్వంగా ఇచ్చింది. పదహారో యేట పెళ్లయి కాపురానికి వచ్చినప్పటినుంచీ యిదే ఆమె వ్యావృత్తి. సెంటర్‌లో కూర్చుని తన వ్యాపారం చూసుకుంటూనే, రోడ్డుమీద వచ్చీపోయే జనాన్ని, సిటీబస్‌లు ఎక్కి దిగుతూ వుండే ప్రయాణికుల్ని, దులాయిగా తిరుగుతున్న సన్నాసి వెధవలను, మొగుళ్లు కష్టపడి పోషిస్తూ వుంటే షోకులు చేసుకుంటూ సినిమాలు చూచే ఆడవాళ్ళను.. యిలా రకరకాల వ్యక్తులను అప్రయత్నంగానే చూసుకుంటూ- ఆమె రోజులు గడుపుకుంటూ పోతోంది. యాంత్రికమైన జీవనం. ఎండకు తట్టుకోవడానికి ఓ గొడుగు తెచ్చుకుంటుంది. దానిని ఎదురుగా వున్న టీ దుకాణంలో భద్రపరుచుకుంటుంది, రోజూ మోసుకుపోయి తీసుకురావలసిన అవసరం లేకుండా. ఆ హోటలు కుర్రవాళ్ళ చేత టీలు తెప్పించుకుంటుంది, అవసరం అయినపుడు పొగాకు చుట్టలు తెప్పించుకుని కుతి తీరా తాగుతూ వుంటుంది. పోలీసులు ఎట్లా తనను దగా చేస్తారో, తనను కాపాడుకోవడం ఎలాగో ఆమెకు క్షుణ్ణంగా తెలుసు. రోజూ అలవాటు అయినవాళ్ళు ఆమెతో వరుసలు కూడా కలిపి దుంపలు, ముక్కలు కొనుక్కుపోతూ వుంటారు. ఆకాశంలో సూర్యునితో పోటీపడ్డట్లుగా అంత ఎండలోనూ దుంపలన్నీ అమ్మేసుకుని చీకటి పడకముందే ఇంటికి చేరుకుంటుంది. ‘ప్రతి అమ్మే దుంప వెనకా తను పడుతున్న కష్టాన్ని గుర్తుకుతెచ్చుకునేది. మాటంటే పడే రకం కాదు గౌరమ్మ. ఎప్పుడూ తన పంతం నెగ్గాలనే తత్వం. దానికితోడు మాట తీరు కరుగ్గా వుండడంతో గౌరమ్మని ఎరిగినవారు చాలామంది చాటుగా ముసల్దానికి పెద్ద పొగరు- అనడం మామూలే. అంతేకాదు, మరొకరికి భయపడకుండా, ఎవర్నీ నమ్మకుండా జీవించడం మాత్రమే తెలుసు’ ఆమెకు.
ఆ రోజు ఆమెకు ఓ చిన్న పిల్ల, దాని తమ్ముడూ తారసపడ్డారు. అమ్మాయి పాడుతూ వుంటే తమ్ముడు తాళం వేస్తాడు. సినిమాలో వచ్చే బూతు పాటలు పాడుకుంటూ జనాన్ని అడుక్కుంటూ పైసలు పోగుచేసుకుంటూ వుంటారు. వాళ్ళ ఆనుపానులన్నీ అడిగి మరీ తెలుసుకుంటుంది గౌరమ్మ. వాళ్ళ తల్లి రోజువారీ వ్యభిచారిణి. పిల్లల్ని అడుక్కోటానికి పంపుతున్న రోగాల పుట్ట. ఆ అమ్మాయి ఆమెకు సహాయం చేస్తుంది. అయితే కుర్రాడు మాత్రం అక్కకు తెలియకుండానే ఒక పెండెలం ముక్క తస్కరించి గౌరమ్మ కంటపడతాడు. వాళ్లిద్దరినీ బండ బూతులు తిట్టి శపిస్తుంది గౌరమ్మ.
ఇంతలో ఆమె మనమడు కూడా చేరుకుంటాడు. నాయనమ్మ వ్యాపారం పూర్తిచేసుకుని ఇంటికి మళ్లటానికి రెడీగా వుందని గమనించింది. తనకు చిరంజీవి సినిమా చూడటానికి డబ్బులు యిమ్మని ముందు వినయంగా, తరువాత దౌర్జన్యంగా అడుగుతాడు. ముసలామెను కడుపుమీద తన్ని దుప్పటి సందుల్లో వున్న డబ్బులు- చేతికి అందినన్ని చిక్కించుకుని సినిమాకు ఉడాయిస్తాడు.
మనుమడి తాపుతో ముసలమ్మ పడిపోవడం చూచి, కొత్తగా పరిచయం అయిన ఆ అమ్మాయి, తమ్ముడు ఆమె దగ్గరకు చేరుకుంటాడు.
తన పోషణలో వున్న మనమడు ‘తన్ని పారిపోవడం, డబ్బు దొంగిలించి తీసుకుపోవడం’ గౌరమ్మను విలపింపజేస్తుంది. ఎవరూ సహాయం చేయడానికి రారు. అక్కా తమ్ముడు మాత్రం ఆత్రంగా దగ్గరకు వస్తారు. అంతే కథ!
రోజువారీ చిల్లర వ్యాపారం చేసుకునే దీనురాలు, ఆమె లోకాన్ని చూసి అనుకుంటూ వుండే మాటలు, ఎదుర్కొనే సన్నివేశాలు- చక్కగా విశాఖపట్టణం ‘లోకల్‌లో రాసిన ఈ కథానిక చదువరులకు జాలి, జుగుప్స, ఆందోళన కలిగిస్తుంది. తమ అసహాయతను ఎత్తిచూపుతుంది.