సబ్ ఫీచర్

సమతావాది శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘క్రూరమైన మొగలారుూల, షాహీల దుష్ప్రవర్తనలతో హిందూ సమాజం దుర్భర జీవితాలను గడుపుతున్న సమయంలో, గో, బ్రాహ్మణుల రక్షణ కరువైన వేళ, పవిత్ర మాతృమూర్తుల కన్నీళ్ళు మహానదులై ప్రవహిస్తున్న వేళ’’లో మనుషుల్లో భగవంతుని చూడమని చెప్పిన గీతాచార్యుడే ‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతాం’ అను గీతా వాక్కును నిజం చేస్తూ ‘శివాజీ’గా అవతరించాడా అన్నట్టు అఖిల భారతావనికి రక్షణగా శివాజీ జన్మించారు.
అఖండ భారతావని వెయ్యేళ్లపాటు బానిసత్వంతో మగ్గిపోయింది. పసితనంలోనే తల్లి ఆలనా పాలనలో ప్రేమించి పూజించే మతం దురవస్థను కళ్లారా చూసి, మతాన్ని, మతానుయాయుల్నీ కాపాడుకోవల్సిన ఆవశ్యకత శివాజీ హృదయంపై ముద్ర పడింది. తల్లి జిజియా పెంపకంలో మతం గురించి, హిందూ సంస్కృతి గురించి, భవానీ మాతపై భక్తిని పెంపొందించడం గురించీ ఎన్నో వీరగాధలు వినిపించింది. బాల్యంలోనే కొండదేవ్ వద్ద చేర్చి అస్తశ్రస్త్ర విద్యలలో నిపుణునిగా చేసింది.
యవ్వనంలో హిందూ ధర్మ సంరక్షునిగా రూపొందడానికి సమర్ధరామదాసుని పాదాల నాశ్రయించాడు. అంతకు మూడు శతాబ్దాల ముందు విద్యారణ్య స్వామి కనుసన్నలలో విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావం, ఆ పరిపాలనా విధానాలను తన గురువుల ద్వారా ఆకళింపు చేసుకున్న శివాజీ తిరిగి హిందూ సామ్రజ్యాన్ని స్థాపించి, హిందూ మతాన్ని పునరుద్ధరిస్తూ, సనాతన ధర్మాన్ని వ్యవస్థీకరింప చేయడానికి ప్రతిన పూనాడు. హైందవ ధర్మ రక్షణ అంటే సామాన్యం కాదు. హిందూ ధర్మం పునర్‌వ్యవస్థీకృతం కావాలంటే సనాతన ధర్మ సిద్ధాంతాలు ప్రాతిపదిక కావాలి అని నమ్మాడు శివాజీ. శివాజీ దృష్టిలో ‘‘సర్వమత సమభావం పాటించాలి. విధర్మీయులు హిందువుల మాన ప్రాణాలను హరిస్తున్నా, మతాన్ని మంట గలుపుతున్నా హిందువులు ధర్మ యుద్ధం చేయాలి. వారి స్ర్తిల మాన ప్రాణాలకు ఏ పరిస్థితిలోను హాని తలపెట్టరాదు’’ అని అన్నాడు శివాజీ. శివాజీ హిందూ మతాభిమానే కాని, ఇతర మతాల పట్ల దురభిమానం మచ్చుకైనా లేదు. అందుకే మస్లిం మతస్థులు కూడ శివాజీ పట్ల భక్తిని, ప్రేమను ప్రదర్శించేవారు. శివాజీకి ముఖ్యంగా ముస్లింల పట్ల ఉన్న గౌరవభావానికి ఉదాహరణగా ఎన్నో చారిత్రకాంశాలు ఉన్నాయి. కల్యాణ్ దుర్గ్ధాపతి కోడలిని హిందూ సంప్రదాయానుసారంగా అత్త వారింటికి పంపడం ఒక అద్భుతమైన సంఘటన. తన అంగరక్షకులుగానే కాకుండా, సైన్యంలో ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించాడు. తన కోటకు సమీపంలో మసీదును నిర్మించి ముస్లింల అభిమానాన్ని చూరగొన్నాడు.
హిందూ మతాన్ని, సంస్కృతిని రక్షించడంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవారు. ఎత్తుకు పైయెత్తు వేయడంలో ఆతనికతడే సాటి. శివాజీని పరిమార్చడానికి దొంగదెబ్బలు కొట్టాలనుకున్నవారిని అదే రీతిలో హతమార్చాడు. రాజ్యాభిషిక్తుడైనా, తాను విజయాలతో సంపాదించిన రాజ్యాన్ని తన గురువు సమర్ధరామదాసు పాదాంకితం చేసి, ఆతని ప్రతినిధిగా మాత్రమే పరిపాలన చేసాడు. శివాజీ కాలంలోనే హిందూ సామ్రాజ్య స్థాపన మరోసారి జరిగి ఎంతగానో విస్తరిల్లింది. భారతదేశ చరిత్రలో సువర్ణఘట్టంగా ప్రస్తుతించబడింది.
ఇలా హైందవమత సముద్ధరణకై జీవితాన్ని సమర్పించిన వీర శివాజీ ప్రతి హిందువుకు ఆదర్శప్రాయుడు. ప్రాతఃస్మరణీయుడు.

- ఎ.సీతారామారావు చరవాణి: 8978799864