Others

‘చెడు వినము, చెడు కనము, చెడు అనము’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్సాంగత్యమెంత ఫలప్రదమో, దుర్జన సాంగత్యం అంతహానికరం. కనుక అది పరిహరించదగినది. అది మనిషిని కామ, క్రోధ, మోహాది అరిషడ్వర్గాల బందిఖానాలో బంధిస్తుంది. చిత్తాన్ని భ్రమింపజేస్తుంది. మనిషి అథఃపాతాళానికి తీసుకొని వెళ్లేటట్టు చేస్తుంది. మనిషిని సర్వనాశనం అయ్యేంతవరకు భ్రమలోనే ఉంచుతుంది. కనుక ‘దుష్టులకు దూరంగా వుండాలి’ అనడం! చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నందువల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు కనుక దుర్జన సాంగత్యం మొగ్గలోనే త్రుంచెయ్యాలంటారు. సర్వకాల సర్వావస్థలలోను అప్రమత్తులై వుండి ‘చెడు వినము, చెడు కనము, చెడు అనము’ అను సూత్రాలను నిరంతరం గుర్తుంచుకుని ఆచరించాలి. కామ క్రోధాలు మొదట్లో నీటి బుడగల్లా చిన్నవిగా కనపడి, దుర్జన సాంగత్యంలో అవి క్రమంగా పెరిగి ‘ఇంతై, ఇంతింతై’ అన్నట్లు విస్తరించి మనిషిని అగాధంలోకి తోస్తాయి. అందుకే చిన్నప్పటి నుంచి దుష్టత్వానికి దూరంగా ఉండాలి. శాశ్వతము కాని, ఈ దృశ్యమాన ప్రపంచమంతా మాయ.. మిథ్య! దీనిపై మమకారం పెంచుకోకుండా, భవబంధములలో చిక్కకుండా వుండాలి. తద్వారా భక్తిని పెంపొందించుకోవాలి.

-వి.మంగతాయారు