తెలంగాణ

రాజ్యసభకు కాంగ్రెస్ సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నిర్ణయించింది. ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దూకుడు పెంచాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె. జానారెడ్డి అధ్వర్యంలో సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన భేటీలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఏఐసీసీ దృష్టికి తీసుకుని వెళ్లి అనుమతి తీసుకోవాలని భావించారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో కుంతియా, జానారెడ్డి, ఉత్తమ్‌లకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత అప్పగించారు. మాజీ ఎంపీలు అజహరుద్దీన్, రవీంద్ర నాయక్, టి.పిసిసి కోశాధికారి గూడురు నారాయణరెడ్డి పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. మెజారిటీ లేకపోయినా పోటీ చేయాలని, ‘విప్’ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయంచారు. శని, ఆదివారాల్లో ఈ త్రిసభ్య కమిటీ పేరును ఖరారు చేయాలని, సోమవారం నామినేషన్ వేయించాలని నిర్ణయించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించారంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. మొత్తం 25 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయంచారు. రైతు సమస్యలు, ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి అసెంబ్లీని స్తంభింపజేయాలని నిర్ణయించారు. ముస్లింలకు, గిరిజనులకు కల్పిస్తామన్న రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని, సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తృతీయ ఫ్రంట్ పేరిట ఆడుతోన్న నాటకాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఇవ్వడం ఆగిపోవడాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. దళితుల వర్గీకరణ అంశంపై ఈనెల 13న ఎమ్మార్పీఎస్ ఇచ్చిన బంద్‌కు మద్దతు ప్రకటించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.