తెలంగాణ

ర్యాలీపై నిఘానేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్‌ను స్పూర్తిగా తీసుకుని ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ నిర్వహించేందుకు తెలంగాణ జేఏసి సన్నద్ధం కావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మాట, ఆట, పాట పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని, అనుమతి ఇవ్వాలన్న జెఏసి అభ్యర్థనను నగర సెంట్రల్ జోన్ డీసీపీ తిరస్కరించారు. అయినప్పటికీ తాము ప్రకటించిన మేరకు ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ స్పూర్తి ర్యాలీ, ఆటా, పాటా, మాటా చేపట్టి తీరుతామని జేఏసి పెద్దలు ప్రకటించడంతో పోలీసులు దీనిపై దృష్టిసారించారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ నేతృత్వంలో సీపీఐ, ఇతర ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వడం ద్వారా జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేసి నగర జీవనాన్ని స్ధంభింప చేసేందుకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత, మిలియన్ మార్చ్ స్ఫూర్తితో తెలంగాణ ఏర్పాటు కావడం, అయితే ప్రజలకు ఆశించినస్థాయిలో పాలన లేదంటూ కోదండరామ్ బాహాటంగానే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, నగర జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతుందని, ఇంటర్, టెన్త్ పరీక్షల సమయం కావడంతో విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని భావించి అనుమతి నిరాకరిస్తున్నట్లు గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ ప్రకటించారు. దీంతో నగర పోలీసులు ట్యాంక్‌బండ్‌పై జరిగే ర్యాలీపై ఫోకస్ పెంచి నిఘా విభాగాలను అప్రమత్తం చేశారు. ముఖ్య నేతల కదలికలను పసిగట్టడంతో పాటు జిల్లాల నుంచి వచ్చే వారిని ఎక్కడికక్కడే అరెస్టులు చేసేందుకు ఇప్పటికే వౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు నగరంలో నిషేధాజ్ఞలు కూడా అమలు చేస్తున్నారు. ర్యాలీకి అనుమతి లేనందున ఎవరూ ట్యాంక్‌బండ్ వద్దకు రావద్దని, వస్తే కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ హెచ్చరించారు. ట్యాంక్‌బండ్, ఇందిరాపార్కు, లిబర్టీ, సచివాలయం తదితర ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నగర సాయుధ బలగాలను మోహరించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన మిలియన్ మార్చ్‌లో విధ్వంసకాండ కొనసాగిన నేపథ్యంలో ఈసారి కూడా అదేస్ధాయిలో జరిగే అవకాశం ఉంటుందన్న సమాచారం మేరకు పటిష్ట బందోబస్తు చేస్తున్నారు. అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా గట్టి భద్రత చర్యలు చేపడుతున్నారు.