తెలంగాణ

పుట్టుకెక్కడో.. చావక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: ‘నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. నా చావు, పుట్టుక తెరాసలోనే. కేసీఆర్ మాటే నా బాట. త్యాగాలు తప్ప ద్రోహం తెలియదు’ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై వెంటనే స్పందించి దోషులను పట్టుకొని జైలుకు పంపించాలని డీజీపీని కోరినట్టు మంత్రి తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక ప్రముఖ చానల్‌లో లోగోను ఉపయోగించుకున్నారని దీనిపై సదరు చానల్ యాజమాన్యం కూడా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెరాస శాసనసభా పక్షం కార్యాలయంలో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘నా రాజకీయ జీవితం ఉద్యమాల నుంచి ప్రారంభమై త్యాగాల పునాదులపై నిర్మితమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి, ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది’ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా అదే పనిగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు మంత్రి హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టింగ్‌కు కారకులు ఎవరో గుర్తించి జైలుకు పంపించే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు అధికారం కల్లే
బస్సు యాత్ర కాదు కదా మోకాళ్లపై యాత్ర చేసినా కాంగ్రెస్‌కు అధికారం కల్లేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన లేకనే అసహనంతో నోటికొచ్చినట్టు కూస్తున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. వారు అధికారంలోకి వచ్చేదీ లేదు, ఒరగబెట్టేది లేదనీ హరీశ్‌రావు ఏద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేద్దామంటే జేఏసీని వదిలి పారిపోయిన ఘనులు కాంగ్రెస్ నాయకులని గుర్తు చేశారు. తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ అంశం లేకపోవడంతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకుతిని కోర్టులు, జైళ్లకు వెళ్లిన చరిత్ర ఆ పార్టీ నాయకులదని విమర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. సీఎం నుంచి జడ్పీ చైర్మన్ వరకు అన్ని పదవులను ఒకే సామాజిక వర్గం అనుభవించి బడుగు బలహీన వర్గాలను అణగదొక్కారని ఆరోపించారు. అధికారం కోసం బీసీలపై ఎక్కడలేని మొసలి కన్నీరు కారుస్తున్నారని తలసాని ధ్వజమెత్తారు.