అంతర్జాతీయం

సెయింట్ థెరెసా..,మానవతామూర్తికి మహోన్నత గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్‌సిటీ, సెప్టెంబర్ 4: మానవతామూర్తికి మహోన్నత గౌరవం లభించింది. నాలుగు దశాబ్దాలపాటు పేదలకు నిస్వార్థంగా సేవ చేసి, నిజమైన ప్రేమకు నిర్వచనం తెలియజేసిన మదర్ థెరెసాకు దైవత్వ కల్పన జరిగింది. ప్రేమ లేకపోవటమే పేదరికమన్న ఆమె సమస్త కేథలిక్ ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవతాస్థానాన్ని అధిష్ఠించింది. మరణానంతరమూ ఆమె చూపించిన సేవాతత్పరతకు కేథలిక్ చర్చి పవిత్ర సెయింట్‌హుడ్ హోదాను భక్తితో, ప్రేమతో సమర్పించుకుంది. ఆమె తన మరణానంతరం చూపించిన రెండు అద్భుతాలను గుర్తించిన కేథలిక్ చర్చ్ సెయింట్‌హుడ్‌తో అపూర్వ హోదాను ఇచ్చింది. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ‘కలకత్తా థెరెసా’కు దైవత్వాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘్భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గౌరవాన్ని కలకత్తా థెరెసాకు కల్పిస్తున్నాం. కేథలిక్ సెయింట్ల సరసన థెరెసాకు చోటు కల్పిస్తున్నాం. విశ్వవ్యాప్తంగా చర్చి థెరెసాను సెయింట్‌గా గుర్తిస్తుంది’’ అని పోప్ ఫ్రాన్సిస్ లాటిన్ భాషలో ప్రకటించారు. ఈ అపూర్వ సన్నివేశాన్ని వీక్షించేందుకు విశ్వవ్యాప్తంగా లక్షమందికి పైగా మదర్ అభిమానులు, కేథలిక్ క్రిస్టియన్లు వాటికన్ తరలి వచ్చారు. మదర్ థెరెసా 19వ వర్ధంతికి ముందు రోజు ఆమెను సెయింట్‌గా ప్రకటించటం విశేషం. నాలుగు దశాబ్దాల పాటు భారత్‌లో పేదల్లోకెల్లా పేదలకు, చనిపోతున్న దశలో ఉన్న అభాగ్యులకు ఆమె చేసిన సేవ నిరుపమానమైనదని పోప్ పేర్కొన్నారు. ఈరోజు భూగ్రహంలోనే ఆమె ఒక అద్భుతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారని ఆయన ప్రశంసించారు. భౌతిక పేదరికంపైనే కాకుండా ఆధ్యాత్మిక పేదరికంపైనా ఆమె పోరాటం చేశారన్నారు. ప్రేమించటం తెలియని వారు, దాన్ని కోరుకోని వారు, పట్టించుకోని వారే నిజమైన పేదలని థెరెసా అనేవారని ఫ్రాన్సిస్ అన్నారు. ఆమె ప్రతిక్షణం జీసస్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నో రకాలుగా మదర్ నిస్వార్థ జీవితం, పేదలకు సేవ చేసే విధానం తనకు ఆదర్శమని పోప్ వ్యాఖ్యానించారు.
మదర్ మరణానంతరం ఆమె చూపించిన రెండు అద్భుతాలను వాటికన్ గుర్తించిన తరువాత ఆమెకు సెయింట్‌హుడ్ ప్రకటించాలని నిర్ణయించిది. ఈ కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలో ఒక బృందం హాజరు కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరో బృందం హాజరయ్యాయి. రక్షణ నిబంధనలు ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎక్కువమందికి టిక్కెట్లు ఇచ్చే అవకాశమున్నప్పటికీ, పరిమితంగానే టిక్కెట్లు జారీ చేశారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు దాదాపు 3వేల మంది అధికారులు సెయింట్‌పీటర్స్ స్క్వేర్‌లో పహారా కాశారు. హెలీకాప్టర్లతో రక్షణ చర్యల్ని నిరంతరం పర్యవేక్షించారు. మిషనరీస్ ఆఫ్ చారీటీ ఇటలీ శాఖల నుంచి దాదాపు 1500మంది పేద ప్రజలు కూడా మదర్ దైవత్వ కల్పన కార్యక్రమానికి హాజరయ్యారు. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ నుంచి దాదాపు 250 మంది సిస్టర్లు, 50 మంది పురుష సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటలీ ఆహారం పిజ్జాను భోజన సమయంలో పంపిణీ చేశారు.

మాతృత్వ వాత్సల్యానికి,
పేదల పట్ల అనిర్వచనీయ అనురాగానికి ప్రతీక థెరెసా..
ఆమె పవిత్ర ఆశయం మనతోనే ఉంటుంది. అందుకే సెయింట్ థెరెసా మనకు అనునిత్యం అమ్మే. -పోప్ ఫ్రాన్సిస్

వాటికన్ సిటీకి తరలివచ్చిన అశేష జనవాహిని
మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ హోదా ప్రకటిస్తున్న పోప్ ఫ్రాన్సిస్