తెలంగాణ

రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ రాజేంద్రనగర్, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ బందోబస్తుకు వచ్చిన ఎస్‌ఐ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. హన్మకొండ జిల్లా పైడిపల్లికి చెందిన శ్రీ్ధర్ (30) కొమరం భీమ్ జిల్లా ఆసీఫాబాద్ మండలం పెంచికల్‌పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. 2012లో ఎస్సైగా విధుల్లో చేరిన శ్రీ్ధర్, మొదట ఏపి బెటాలియన్ కానిస్టేబుల్‌గా పనిచేసి అనంతరం ఎస్సైగా ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ రెండురోజుల పర్యటన నేపథ్యంలో భద్రత నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. శ్రీ్ధర్‌తోపాటు మరో ఐదుగురు సిబ్బందికి ఉప్పర్‌పల్లిలోని 20 అంతస్తుల హ్యాపీ హోమ్స్ అపార్టుమెంట్‌పై గస్తీ డ్యూటీ వేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ శ్రీ్ధర్ శుక్రవారం రాత్రి గం. 11.00ల ప్రాంతంలో తాను అలసిపోయానని, విశ్రాంతి తీసుకుంటానని తోటి సిబ్బందికి చెప్పి 19వ అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రిలీవర్ రాజేష్ ఎస్‌ఐ గదికి వచ్చి చూడగా శ్రీ్ధర్ రక్తపు మడుగులో పడిఉన్నాడు. వెంటనే అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఏసిపి గంగారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని హ్యాపీ హోమ్స్ అపార్టుమెంట్ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఏంజరిగిందో అర్థంకాక ఆ ప్రాంతమంతటా కలకలం రేగింది.
ప్రేమ వ్యవహారమే..?
వరంగల్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్‌తో గత రెండేళ్లుగా ఎస్‌ఐకి ప్రేమవ్యవహారం నడుస్తుందని మృతుడికి సన్నిహితంగా ఉండే హోంగార్డు సందీప్ తెలిపాడు. అయితే ఆమెతో పెళ్లి విషయమై శ్రీ్ధర్ కుటుంబీకులు అభ్యంతరం తెలుపుతుండటంతో వివాదం కొనసాగుతోంది. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, లేదంటే చనిపోతానని పలుమార్లు తెలిపేవాడని వివరించాడు. ఈనెల 24న ప్రధాని పర్యటన బందోబస్తుకు హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో తాను వారించానన్నారు. శుక్రవారం రాత్రి 8.30 ప్రాంతంలో ఎస్సై శ్రీ్ధర్‌తో తాను మాట్లాడి వెళ్లిపోయానని, శనివారం ఉదయం ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు. దీంతో అనుమానం వచ్చి వెళ్లి చూసేసరికి చనిపోయి ఉన్నాడని హోంగార్డు సందీప్ వివరించాడు. గతంలో శ్రీ్ధర్ గుడిహత్నూర్, ముధోల్, కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లలో పని చేశాడని, ఎస్‌ఐ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నట్టు ఎసిపి గంగారెడ్డి తెలిపారు.
చిత్రం... సంఘటనా స్థలంలో ఎస్‌ఐ శ్రీ్ధర్ మృతదేహం. ఇన్‌సెట్‌లో శ్రీ్ధర్ (ఫైల్‌ఫొటో)