అంతర్జాతీయం

ఉత్తమ చిత్రంగా బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్‌ : గత ఏడాది విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు సంబంధించి సైమా అవార్డుల వేడుక సింగపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. తొలిరోజు సైమా వేడుకకు చిరంజీవి, అల్లు అర్జున్‌, రాధిక, సుహాసిని, హన్సిక, సమంత, రానా, అలి, వరుణ్‌తేజ్‌, నిత్యామేనన్‌, విక్రమ్‌, నయనతార, రాజేంద్రప్రసాద్‌, శ్రుతిహాసన్‌, సాయేషా సైగల్‌, ప్రణీత, గాయని సుశీల హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగులో అవార్డులు గెలుచుకున్న వారి జాబితాను ప్రకటించారు. ‘బాహుబలి’ చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ‘శ్రీమంతుడు’ చిత్రానికి గానూ మహేశ్‌బాబు ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు.