తెలంగాణ

చైన్‌స్నాచింగ్ ఘటనలో పసికందు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ మహిళకు, చైన్‌స్నాచర్లకు మధ్య జరిగిన పెనుగులాట ఫలితంగా 25 రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నగరంలోని నేరేడ్‌మెట్‌లో మంగళవారం రాత్రి జరిగింది. అయితే, ఈ ఘటనపై విభిన్నకథనాలు వినిపిస్తున్నాయి. పెనుగులాటలో కత్తిగాయాలు తగలడం వల్ల శిశువు మృతిచెందినట్లు వార్తలు వ్యాపించాయి. అయితే, పెనుగులాటలో మహిళ చేతుల్లో నుంచి కింద పడడం వల్లే పసికందు గాయపడి మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళ చెబుతున్న విషయాలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆమె ఇంటికి పోలీసులు చేరుకుని రక్తం మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకుని, చైన్‌స్నాచర్ల కోసం గాలిస్తున్నారు.