క్రీడాభూమి

టెస్టు క్రికెట్‌కు కులశేఖర గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 1: శ్రీలంక వెటరన్ ఫాస్ట్ బౌలర్ నవాన్ కులశేఖర టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాను టెస్టు ఫార్మెట్ నుంచి వైదొలగుతున్నానని అతను ఒక ప్రకటనలో తెలిపాడు. వనే్డ, టి-20 ఫార్మెట్స్‌పై దృష్టి కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అతను కెరీర్‌లో 21 టెస్టులు ఆడాడు. 48 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌తో 2009లో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులకు ఎనిమిది వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడే అలవాటులేని అతని అత్యధిక స్కోరు 64 పరుగులు. 2006లో లార్డ్ మైదానంలో ఇంగ్లాండ్‌పై అతను స్కోరును సాధించాడు.

చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్

పాక్‌తో భారత్ తొలి పోరు

లండన్, జూన్ 1: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొలి మ్యాచ్‌ని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ ఖరారుకాగా, భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్ నుంచి పోటీపడనుండడం ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఏడాది జూన్ ఒకటో తేదీన మొదలయ్యే ఈ టోర్నీ 18 రోజుల పాటు జరుగుతుంది. నాలుగో తేదీన ఎడ్జిబాస్టన్ మైదానంలో భారత్ తన తొలి మ్యాచ్‌ని పాక్‌తో ఆడుతుంది. 2015 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లకు చాంపియన్స్ ట్రోఫీలో పోటీపడే అవకాశం లభిస్తుంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు కూడా పోటీపడతాయి. 2006 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సంపాదించింది. కాగా, భారత్ ‘బి’ గ్రూప్ నుంచి బరిలోకి దిగనుంది. ఈ గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్‌తోపాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడతాయి.