క్రీడాభూమి

ఫయజ్ ఫజల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: రంజీట్రోఫీలో భాగంగా హైదరాబాద్ జట్టుతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ కెప్టెన్, ఓపెనర్ ఫయజ్ ఫజల్ (126, నాటౌట్) సెంచరీ సాధించాడు. అంతకుముందు హైదరాబాద్ జట్టు 272 పరుగులకు ఆలౌటైంది. ప్రతీక్ రెడ్డి (83) ఆకట్టుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన విదర్భ జట్టులో అక్షయ్ కొల్హర్ (3), అనిరుద్ధ చౌదరి (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా, కెప్టెన్ ఓపెనర్ ఫయజ్ ఫజల్ (126, నాటౌట్) సెంచరీకి తోడు గణేష్ సతీష్ (65) అర్ధ సెంచరీ సాధించి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సిద్దేష్ వాత్ (28) పరుగులకే క్రీజు వదలగా, వికెట్ కీపర్ అక్షయ్ వాద్కార్ (9) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ జట్టు 4 వికెట్లు కోల్పోయ 242 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రవి కిరణ్‌కు 2 వికెట్లు దక్కగా, మహ్మద్ సిరాజ్, అంకిత్ రెడ్డి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.