క్రీడాభూమి

పొరెల్‌కు ఐదు వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 1: ఇషాన్ పొరెల్ ఐదు వికెట్లు పడగొట్టడంతో, బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో కర్నాటక 122 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు అనుస్తుప్ మజుందార్ అజేయ సెంచరీతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లకు 275 పరుగులు చేసిన బెంగాల్ రెండో రోజు, ఆదివారం ఉదయం ఆటను కొనసాగించి 312 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ పొరెల్ ఏడు పరుగులు చేసి రోనిత్ మోరె బౌలింగ్‌లో బౌల్డ్‌కావడంతో బెంగాల్ ఇన్నింగ్స్ ముగిసింది. అనుస్తుప్ 149 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కర్నాటక బౌలర్లలో అభిమన్యు మిథున్, రోనిత్ మోరె చెరి మూడు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్థ్ కృష్ణ, కృష్ణప్ప గౌతం చెరి రెండు వికెట్లు సాధించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నాటక ఒక పరుగు స్కోరు వద్ద ఓపెనర్ రవి కుమార్ సమర్థ్ (0) వికెట్‌ను కోల్పోయింది. ఇషాన్ పొరెల్ బౌలింగ్‌లో అతను మనోజ్ తివారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఓపెనర్, టెస్టు ఆటగాడు లోకేష్ రాహుల్ 26, కృష్ణప్ప గౌతం 31, అభిమన్యు మిథున్ 24 చొప్పున పరుగులు చేయగా, మిగతా వారు ఆ మాత్రం కూడా రాణించలేకపోవడంతో కర్నాటక 36.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ పొరెల్ 13 ఓవర్లలో 39 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఆకాశ్ దీప్ 30 పరుగులకు మూడు, ముకేష్ కుమార్ 46 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.
మొదటి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 190 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసిన బెంగాల్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టి, రెండో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 74 పరుగులు చేసింది. ఈ జట్టుకు కర్నాటకపై ఇప్పటికి 262 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సందీప్ చటర్జీ 40, అనుస్తుప్ మజుందార్ ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. అభిమన్యు మిథన్ 6 ఓవర్లలో 9 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్థ్ కృష్ణ ఒక వికెట్ తీశాడు.