క్రీడాభూమి

మహిళా టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్: మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుపై 85 పరుగుల తేడాతో విజ యం సాధించి, ఐదోసారి కప్‌ను ముద్దాడింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు అలీస్సా హేలీ, బేత్ మూనీ మొదటి బంతి నుంచే చెలరేగి ఆడారు. వీరిద్దరూ కలిసి మైదానం నలుమూ లాల బౌండరీలు బాదుతూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డా రు. కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ బౌలర్లను మార్చినా ఫలితం లేకుం డా పోయంది. ఈ క్రమంలో అలీస్సా హేలీ 30 బంతుల్లోనే బౌండరీ బాది అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత షిఖా పాండే ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది తనేంత ప్రమాదకరమో చాటింది. అయతే ఆ మరుసటి ఓవర్‌లోనే రాధా యాదవ్ వేసిన అద్భుత బంతికి అలీస్సా హేలీ (75) వేదా కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మెగ్ లన్నింగ్‌తో కలిసి మరో ఓపెనర్ బేత్ మూనీ జట్టును ముందుకు తీసుకెళ్లింది. ఈ దశలో 41 బంతుల్లోనే తన టీ20 కెరీర్‌లో 9వ అర్ధ సెంచరీని పూర్తిచేసు కుంది. మరోవైపు రెండు బౌండరీలతో ఆకట్టుకున్న ఆసీస్ కెప్టెన్ మెగ్ లన్నింగ్ (16) దీప్తి శర్మ బౌలింగ్‌లో శిఖా పాండేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అష్లే గార్డ్‌నర్ (2), రాఖేల్ హేన్స్ (4) తక్కువ స్కోర్లకే అవుటైనా, బేత్ మూనీ (78, నాటౌట్) మాత్రం బౌండరీలతో విరుచుకుపడింది. నికోలా క్యారీ (5, నాటౌట్)తో కలిసి చివరి వరకు క్రీజులో నిలి చింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పో య 184 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మకు 2 వికెట్లు పడగా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
తొలి ఓవర్ నుంచే..
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు టపాటపా వికెట్లు చేజార్చుకుంది. తొలి ఓవర్ నుంచే తడబడ్డ బ్యాటర్లు ప్రత్యర్థి జట్టుకు పూర్తిగా దాసోహమయ్యారు. గ్రూప్ మ్యాచ్‌ల న్నింటిలోనూ చెలరేగిన ఓపెనర్ షెఫాలీ వర్మ (2) మెగాన్ షుట్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే వికెట్ కీపర్ హేలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీప ర్ తాన్యా భాటియా (2) రిటైర్ట్ హార్ట్‌గా క్రీజును వదిలింది. ఆ వెంటనే బ్యాటింగ్‌కు వచ్చిన జెమీమా రోడ్రీగ్స్ (0), కొద్దిసేపటి కే స్మృతీ మంధాన (11), మరి కొద్దిసేపటికే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (4) నిరాశ పరచడంతో టీమిండియా 6 ఓవర్లలో 30 పరుగులు చేసి 4 కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది.
పరువు కాపాడిన మిడిలార్డర్..
టాప్ ఆర్డర్ వైఫల్యానికి తోడు ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా 50 పరుగుల లోపే కుప్పకూలుతుందని భావిం చారంతా. అయతే అనూహ్యాంగా దీప్తీ శర్మ, వేదా కృష్ణమూర్తి (19) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదా కృష్ణమూర్తి డెలీస్సా కిమ్మిన్స్‌కు వికెట్ సమర్పించుకోగా, కొద్దిసేపటికే దీప్తి శర్మ (33) కూడా నికోలా క్యారీ బౌలింగ్‌లో అవుటైంది. వీరి తర్వాత రిచా ఘోష్ (18) ఫర్వాలేదనిపించినా, శిఖా పాండే (2), రాధా యాదవ్ (1), పూనమ్ యాదవ్ (1) వరుసగా అవుట్ కావడంతో హర్మన్‌సేనకు ఓటమి తప్పలేదు. ఇన్నింగ్స్ ముగిసేందుకు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 99 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగాన్ షుట్ 4 వికెట్లు తీయగా, జెస్ జొనస్సేన్ 3, సోపీ మోలినిక్స్, డెలిస్సా కిమ్మిన్స్, నికోలా క్యారీ తలో వికెట్ పడగొట్టి జట్టు విజయం లో తమ వంతు పాత్ర పోషించారు. మరోవైపు ఈ విజయంతో ఆ స్ట్రేలియా ఐదోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
స్కోర్ బోర్డు..
ఆస్ట్రేలియా వుమెన్స్ ఇన్నింగ్స్: అలీస్సా హేలీ (సీ) కృష్ణమూర్తి (బీ) రాధా యాదవ్ 75, బేత్ మూనీ (నాటౌట్) 78, మెగ్ లన్నింగ్ (సీ) శిఖా పాండే (బీ) దీప్తి శర్మ 16, అష్లే గార్డ్‌నర్ (స్టంప్) తాన్యా భాటియా (బీ) దీప్తి శర్మ 2, రాఖేల్ హేన్స్ (బీ) పూనమ్ యాదవ్ 4, నికోలా క్యారీ (నాటౌట్) 5.
ఎక్స్‌ట్రాలు: 4 మొత్తం: 184 (20 ఓవర్లలో 4 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-115, 2-154, 3-156, 4-176
బౌలింగ్: దీప్తి శర్మ 4-0-38-2, శిఖా పాండే 4-0-52-0, రాజేశ్వరి గైక్వాయడ్ 4-0-29-0, పూనమ్ యాదవ్ 4-0-30-1, రాధా యాదవ్ 4-0-34-1.
భారత్ వుమెన్స్ ఇన్నింగ్స్: షెఫాలీ వర్మ (సీ) హేలీ (బీ) షుట్ 2, స్మృతీ మంధాన (సీ) నికోలా క్యారీ (బీ) మోలినిక్స్ 11, తాన్యా భాటియా (రిటైర్డ్ హార్ట్ ) 2, జేమీమా రోడ్రీగ్స్ (సీ) నికోలా క్యారీ (బీ) జొనస్సేన్ 0, హర్మన్‌ప్రీత్ కౌర్ (సీ) గార్డ్‌నర్ (బీ) జొనస్సేన్ 4, దీప్తి శర్మ (సీ) మూనీ (బీ) నికోలా క్యారీ 33, వేదా కృష్ణమూర్తి (సీ) జొనస్సేన్ (బీ) డెలీస్సా కిమ్మిన్స్ 19, రిచా ఘోష్ (సీ) నికోలా క్యారీ (బీ) షుట్ 18, శిఖా పాండే (సీ) మూనీ (బీ) షుట్ 2, రాధా యాదవ్ (సీ) మూనీ (బీ) జొనస్సేన్ 1, పూనమ్ యాదవ్ (సీ) గార్డ్‌నర్ (బీ) షుట్ 1, రాజేశ్వరి గైక్వాయడ్ (నాటౌట్) 1.
ఎక్స్‌ట్రాలు: 5 మొత్తం: 99 (19.1 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-2, 2-8, 3-18, 4-30, 5-58, 6-88, 7-92, 8-96, 9-97, 10-99.
బౌలింగ్: మెగాన్ షుట్ 3.1-0-18-4, జెస్ జొనస్సేన్ 4-0-20-3, సోపీ మోలినిక్స్ 4-0-21-1, డెలీస్సా కిమ్మిన్స్ 4-0-17-1, నికోలా క్యారీ 4-0-23-1.
*చిత్రం...మహిళా టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా