క్రీడాభూమి

ఐపీఎల్‌పై నీలినీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ధర్మశాల, మార్చి 12: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై నీలినీడలు కమ్ము కున్నాయ. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్‌పై తన వైఖరిని స్పష్టం చేసినా, నిర్వహణ సందే హంగా మారింది. మరోవైపు భారత ప్రభుత్వం వీసా నిబంధనలపై కఠినమైన ఆ ంక్షలను విధించ డం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. ఐపీఎల్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు ఈ నిబంధనతో ఏప్రిల్ 15 వరకు భారత్‌లో అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తు తం కేంద్ర ప్రభుత్వం దౌత్య సంబంధ, వర్క్ వీసాలు మాత్రమే అనుమ తిస్తుండడంతో విదేశీ క్రికెటర్లు రావడం కస్టతరంగా మారింది. ఆటగాళ్లకు వాణిజ్య సంబంధ వీసా జారీ చేయడం తోనే ఈ చిక్కొచ్చి పడింది. ఇప్పటికే టోర్నీ నిర్వహించొద్దంటూ మహా రాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అలాగే మద్రాస్ హైకోర్టులోనూ ఓ పిటిష న్ దాఖలైన విషయం తెలిసిందే. అయతే దీనిపై శనివారం ముంబయలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. వారి సమావేశం తర్వాతే మరిన్ని విషయాలు తెలిసే అవకాశ ముంది. ఇదిలాఉంటే కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రధాన టోర్నీలను వాయిదా లేదా రద్దు చేయాలని బీసీసీఐ సహా అన్ని క్రీడా స మాఖ్యలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తప్పనిసరి పరిస్థి తుల్లో టోర్నీ నిర్వహించాల్సి వస్తే ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహిం చాలని సూచించింది. అయితే దీనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ. ఇప్పటికిప్పుడు టోర్నీని రద్దు చేస్తే చాలా నష్టపోతా మని పేర్కొంటోంది. టోర్నీ రద్దు లేదా వాయిదా వేస్తే నష్టం భారీ స్థాయలో ఉండ నుందని, ఖాళీ మైదానాల్లో నిర్వహిస్తే తక్కువ నష్టాలతో బయటపడవచ్చని భావిస్తున్నాయ. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ కు ప్రేక్షకులెవరినీ అనుమతించక పోవడం విశేషం. రంజీట్రోఫీ ఫైనల్‌ను సైతం చివరి రోజు (శుక్రవారం) మైదానం లోకి బయటినుంచి ఎవరినీ అనుమతించబోమని బీసీసీఐ స్ప ష్టం చేసింది. అఖరి రోజు ఆటగాళ్లు, అధికారులు, మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తామని బీసీసీఐ జనరల్ మేనేజర్ సాబా కరీం పేర్కొన్నాడు. దీనిని బట్టి చూస్తే ఐపీఎల్ ను ఇదే తరహా నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్రికె టే కాకుండా షుటింగ్ వరల్డ్ కప్, ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌ను వాయిదా వేయగా, బ్యాడ్మింటన్ ఇండియన్ ఓపెన్‌కు అభిమానులను ఎవరినీ అనుమతించకుం డా నిర్వహించనున్నారు.