క్రీడాభూమి

ఒలింపిక్స్ వాయిదా తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓస్లో, మార్చి 21: కరోనా వైరస్ ఉధృతి తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ ఒలింపిక్స్‌ను వాయిదా వేయక తప్పదని నార్వే ఒ లింపిక్ కమిటీ (ఎన్‌ఓసీ) అభిప్రాయపడింది. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ఈ వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ ఒలింపిక్స్ నిర్వహణకు ఎలాంటి చర్య లు తీసుకోవద్దని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ)కి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్‌కు లేఖ రాసిం ది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహణ సరైనది కాదని ఆ లేఖలో వ్యాఖ్యానించింది. ఈసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్ లోనూ కరోనా ఉధృతి ఎక్కువగా ఉందని, కాబట్టి అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోటీలను వాయిదా వేయాలని సూచించింది. వివిధ దేశాలు విదేశాలకు రాకపోకలపై ఆంక్ష లు విధించిన నేపథ్యంలో అథ్లెట్ల రాక కూడా సమస్యాత్మకంగా మారుతుందని అభిప్రాయపడింది. అథ్లెట్ల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని హితవు పలికింది. ఇలావుంటే, ఒలింపిక్స్‌ను వాయిదా వేసే అంశాన్ని ఇప్పటి నుం చే చర్చించడంలో ఎలాంటి అర్థం లేదని ఐఓ సీ చీఫ్ బాచ్ ఇప్పటికే ప్రకటించాడు. మరోవైపు ఆస్ట్రేలియా సాకర్ లీగ్ పోటీలు యథాతథంగా జరుగుతున్నాయి. దీంతో ఒలింపిక్స్ ని ర్వహణా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తవుతుందని అధికారులు ధీమాతో ఉన్నారు.
అమెరికా, ఫ్రాన్స్ కూడా..
అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లోనూ కొన్ని క్రీడా సమాఖ్యలు కూడా ఒలింపిక్స్ వాయిదాను కోరుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం తప్ప, మరో మార్గం లేదని అమెరికా స్విమ్మింగ్ సమాఖ్య చీఫ్ టిమ్ హించెయ్ తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్‌ను షెడ్యూల్ ప్రకారం జూలై 24న ప్రారంభిస్తే అథ్లెట్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. నార్వే స్విమ్మింగ్ సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్) కూడా ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేసింది. కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్నదిగానీ తగ్గడం లేదని, ఈ పరిస్థితుల్లో ఒలింపిక్స్‌కు అథ్లెట్లు సిద్ధం కావడం కూడా కష్టమని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. ఉన్నత ప్రమాణాలేవీ అందుకోకుండా, సరైన శిక్షణ ఏదీ లేకుండా పోటీలకు వచ్చే అథ్లెట్లతో ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీలను నిర్వహించడంలో అర్థం ఉండదని స్పష్టం చేసింది.