క్రీడాభూమి

శిక్షణా శిబిరం సేఫ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 21: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రంలో ప్రారంభమైన శిక్షణా శిబిరంలో అన్నివిధాలా భద్రత ఉందని జాతీయ పురుషులు, మహిళల హాకీ జట్లు ధీమా వ్యక్తం చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పలు టోర్నీలు, ఇతరత్రా కార్యక్రమాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న హాకీ జట్లకు శిక్షణను యథావిధిగా కొనసాగించాలని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఇదివరకే నిర్ణయించింది. దాని ప్రకారమే అన్నిరకాల భద్రతా చర్యల మధ్య ‘సాయ్’ కేంద్రాన్ని సిద్ధపరిచింది. స్టేడియం వెలుపల రెండంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. క్రీడాభిమానులను, సందర్శకులను లోనికి అనుమతించడం లేదు. అంతేకాకుండా అనధికార వ్యక్తులెవరూ స్టేడియం గేటు లోపలికి అడుగు పెట్టకుండా పటిష్టమైన భద్రతను కూడా కల్పించింది. పరిశుభ్రతను పాటిస్తూ, కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నది. ‘కోవిడ్-19 విజృంభణ వల్ల మాకెలాంటి సమస్యా లేదు. ప్రాక్టీస్ సెషన్స్ సజావుగానే సాగుతాయి. మేము ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటునే ఉన్నాం.
శరీర ఉష్ణోగ్రతలను క్రమం తప్పకుండా నోట్ చేసుకుంటున్నాం. సాయ్ అధికారులు కూడా అన్ని అంశాలనూ పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో శిక్షణా శిబిరం నడుస్తున్నది. కాబట్టి మాకు ఎలాంటి భయాందోళనలూ లేవు’ అని పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. అధికారులు, కోచ్‌లు, ఇతర ప్రముఖుల సమక్షంలో ఒలింపిక్స్‌కు అన్నివిధాలా సిద్ధమవుతున్నట్టు చెప్పాడు. సాయ్ క్యాంపస్‌లో ఇంతమంచి వాతావరణం ఉండడం నిజంగా తమ అదృష్టమని మహిళల జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ వ్యాఖ్యానించింది.
అనారోగ్యానికి గురయ్యే అంశాలేవీ లేవని ఆమె పేర్కొంది. తమ ఆరోగ్యం పట్ల అధికారులు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని, కాబట్టి కరోనా లేదా ఇతరత్రా వైరస్‌లు సోకుతాయన్న ఆందోళన తమకేమాత్రం లేదని ఆమె స్పష్టం చేసింది. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని, అవసరమైన ఔషధాలను కూడా సమకూరుస్తున్నారని చెప్పింది. ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడుతుంది. మహిళల జట్టు తొలి ప్రత్యర్థి నెదర్లాండ్స్. ఈ రెండు జట్లు క్వాలిఫయర్స్ ద్వారా ఒలింపిక్స్ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాయి.